బ్లాక్ బ‌స్టర్ సినిమా ‘మామన్’ ఈ ఆదివారం సాయంత్రం 6 గంటలకు.. మీ జీతెలుగులో!

బ్లాక్ బ‌స్టర్ సినిమా ‘మామన్’ ఈ ఆదివారం సాయంత్రం 6 గంటలకు.. మీ జీతెలుగులో!
తెలుగు ప్రేక్షకులకు అంతులేని వినోదం అందించే జీ తెలుగు ఈ ఆదివారం మరో సరికొత్త సినిమాతో మీ ముందుకు రాబోతోంది. భావోద్వేగాల సమాహారంగా థియేటర్, ఓటీటీలో బ్లాక్బస్టర్ హిట్గా నిలిచిన మామన్ సినిమాను వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్గా అందిస్తోంది. కోలీవుడ్ నటుడు సూరి, ఐశ్వర్య లక్ష్మి జంటగా నటించిన సూపర్హిట్ సినిమా మామన్, ఈ ఆదివారం సాయంత్రం 6 గంటలకు, మీ జీ తెలుగులో! 

ఈ సినిమా కథ ఇన్బా(సూరి) కుటుంబమే ప్రధానంగా సాగుతుంది. ఇన్బా అక్క గిరిజ(స్వాసిక)కు పెళ్లైన పదేళ్ల తర్వాత నీలన్ అలియాస్ లడ్డు(ప్రగీత్ శివన్) పుడతాడు. పుట్టినప్పటి నుంచి లడ్డు ఇన్బా దగ్గరే ఎక్కువగా ఉంటాడు. ఇన్బా ఒక గైనకాలజిస్ట్ రేఖ (ఐశ్వర్య లక్ష్మి)ను పెళ్లి చేసుకున్న తర్వాత పరిస్థితి మారిపోతుంది. భార్యతో ఒంటరిగా గడపాల్సిన సమయం కూడా లడ్డుతోనే గడిపేస్తున్న ఇన్బాను చూసి రేఖకు అసహనం కలుగుతుంది. 

పెళ్లి తర్వాత లడ్డు వల్ల ఇన్బా-రేఖల మధ్య ఎందుకు గొడవలు జరిగాయి?  ఆ గొడవలను ఇన్బా ఎలా పరిష్కరించాడు?  లడ్డు-ఇన్బాల బంధాన్ని రేఖ అర్థం చేసుకుంటుందా? అనే ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే... ఈ ఆదివారం సాయంత్రం 6 గంటలకు జీ తెలుగులో ప్రసారమయ్యే ‘మామన్’ సినిమా చూడాల్సిందే!

ప్రశాంత్ పాండియరాజ్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో కమెడియన్గా పేరుగాంచిన సూరి హీరోగా నటించగా, ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్‌గా, స్వాసిక, ప్రగీత్ శివన్, రాజ్‌కిరణ్, విజి చంద్రశేఖర్, బాబా మాస్టర్ ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. భావోద్వేగాలు, వినోదంతో ఆద్యంతం అలరించే ఈ సినిమాను మీరూ మిస్ కాకుండా చూసేయండి!

More Press News