జీ తెలుగు డాన్స్ రియాలిటీ షో.. ఆట 2.0 ఆడిషన్స్ మన హన్మకొండలో!

జీ తెలుగు డాన్స్ రియాలిటీ షో.. ఆట 2.0 ఆడిషన్స్ మన హన్మకొండలో!
తెలుగు టెలివిజన్ చరిత్రలో అత్యంత ఆదరణ పొందిన డాన్స్ రియాలిటీ షో ‘ఆట’. ఈ కార్యక్రమంతో ఎందరో ప్రతిభావంతులైన డాన్సర్లను వెలుగులోకి తీసుకొచ్చిన జీ తెలుగు ఆట 2.0 అంటూ సరికొత్త సీజన్తో మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. త్వరలోనే జీ తెలుగులో ఘనంగా ప్రారంభంకానున్న ఈ డాన్స్ రియాలిటీ షోకి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో విస్తృతంగా ఆడిషన్స్ నిర్వహిస్తోంది. 
 
డాన్స్ పై మక్కువ గల వారికి జీ తెలుగు అందిస్తున్న సువర్ణావకాశం. 5 నుంచి 60 సంవత్సరాల వయసు గల ఎవరైనా ఈ ఆడిషన్స్ లో పాల్గొని తమ ప్రతిభను నిరూపించుకోవచ్చు. రేపు ఉదయం 10 గంటల నుంచి 4 గంటల వరకు హన్మకొండలోని హోటల్ హరిత కాకతీయ, తెలంగాణ టూరిజం, నక్కలగుట్ట నందు జీ తెలుగు ఆధ్వర్యంలో ఆట 2.0 ఆడిషన్స్ జరగనున్నాయి. ఆన్‌గ్రౌండ్‌ ఆడిషన్స్ లో పాల్గొనలేనివారు డిజిటల్ ఆడిషన్స్ లో కూడా పాల్గొనవచ్చు. వాటాప్స్(WhatsApp )లో 70322 23913 నెంబర్ కి ‘Hi’ అని మెసేజ్ చేయండి లేదా https://aata.zee5.com వెబ్సైట్లోనూ మీ డాన్స్ వీడియోను అప్లోడ్ చేసి ఆడిషన్స్ లో పాల్గొని మీ ప్రతిభను నిరూపించుకునే అవకాశం పొందవచ్చు. ఇంకెందుకు ఆలస్యం వెంటనే ఆడిషన్స్ లో పాల్గొని జీ తెలుగు ఆట 2.0 టైటిల్ పోటీలో మీరూ పాల్గొనండి. 


Aata 2.o Zee Telugu

More Press News