నవంబరు 28న థియేటర్‌లోకి రానున్న 'జనతాబార్‌'

నవంబరు 28న థియేటర్‌లోకి రానున్న 'జనతాబార్‌'
ప్రముఖ కథానాయిక రాయ్‌ లక్ష్మీ ప్రధాన పాత్రలో రూపొందుతోన్న లేడి ఓరియెంటెడ్‌ చిత్రం 'జనతాబార్‌'. రోచి మూవీస్ పతాకంపై రమణ మొగిలి స్వీయ దర్శకత్వంలో అశ్వర్థ నారాయణ సమర్పణలో నిర్మాణం జరుపుకుంటోన్న ఈ చిత్రం నిర్మాణానంతర పనులు తుదిదశకు చేరుకున్నాయి. ఈ నెల 28న చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా థియేటర్‌లో విడుదల చేస్తున్నారు. ఈ సందర్బంగా దర్శక, నిర్మాత రమణ మొగలి మాట్లాడుతూ '' స్పోర్ట్స్‌ను కెరీర్‌గా ఎంచుకున్నమహిళలపై ఆ స్పోర్ట్స్‌ విభాగంలో ఉన్న ఉన్నతాధికారులు తమ అధికారాన్ని అడ్డుపెట్టుకుని చేస్తున్న సెక్సువల్‌ హరాస్‌మెంట్‌కు చరమగీతం పాడటానికి పోరాడిన ఓ మహిళ కథ ఇది. 

ఈ చిత్రంలో రాయ్‌ లక్ష్మీ పాత్ర ఎంతో పవర్‌ఫుల్‌గా ఉంటుంది. పూర్తి కమర్షియల్‌ అంశాలతో పాటు సమాజానికి మంచి సందేశంతో పాటు మహిళల్లో చైతన్యం నింపే సినిమా ఇది. బాలీవుడ్‌ నటుడు శక్తికపూర్‌ ఈ చిత్రంలో ఎంతో శక్తివంతమైన పాత్రను పోషించాడు.తప్పకుండా ఈచిత్రం కమర్షియల్‌గా మంచి విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది' అన్నారు. అమన్‌ ప్రీతిసింగ్‌, దీక్షపంత్‌, శక్తికపూర్‌, అనూప్‌సోని, ప్రదీప్‌రావత్‌, సురేష్‌ భూపాల్‌ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి పాటలు: రాంబాబు గోసాల, కళ్యాణ్‌ చక్రవర్తి, శ్రీనివాస్‌తేజ, ఫోటోగ్రఫి: చిట్టిబాబు,సంగీతం: వినోద్‌ యజమాన్య, రచయిత:  రాజేంద్ర భరద్వాజ్‌.
Raai Laxmi
Janatha bar
Ramana Mogili
Tollywood

More Press News