నా కెరీర్ లో రైట్ టైమ్ లో చేసిన సినిమా ది గర్ల్ ఫ్రెండ్ అంటోన్న రష్మిక

నా కెరీర్ లో రైట్ టైమ్ లో చేసిన సినిమా ది గర్ల్ ఫ్రెండ్ అంటోన్న రష్మిక
రష్మిక మందన్న, టాలెంటెడ్ హీరో దీక్షిత్ శెట్టి  జంటగా నటిస్తున్న సినిమా "ది గర్ల్ ఫ్రెండ్". ఈ సినిమాను ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇంటెన్స్, ఎమోషనల్ లవ్ స్టోరీతో దర్శకుడు రాహుల్ రవీంద్రన్ రూపొందిస్తున్నారు. ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి నిర్మాతలుగా వ్యవహిస్తున్నారు. సరికొత్త ప్రేమ కథగా తెరకెక్కుతున్న ఈ సినిమా నవంబర్ 7న హిందీతో పాటు తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. ఈ రోజు "ది గర్ల్ ఫ్రెండ్" సినిమా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో గ్రాండ్ గా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 

డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ మాట్లాడుతూ - నేను స్టూడెంట్ గా హాస్టల్లో ఉండే రోజుల్లో ఈ స్టోరీ ఐడియా వచ్చింది. దాన్ని కొన్నేళ్ల క్రితం స్టోరీగా రాసుకున్నా. మీరు ఇప్పుడు ట్రైలర్ లో ఏం చూశారో అదే సినిమా. ఇంటెన్స్ ఎమోషన్ తో ఉంటుంది. రిలేషన్ షిప్ ట్రై చేయాలనుకునే వారు ఈ సినిమాకు బాగా కనెక్ట్ అవుతారు. అమ్మాయిలైనా, అబ్బాయిలైనా "ది గర్ల్ ఫ్రెండ్"  సినిమా చూసి ఆ ఎమోషన్ తో బయటకు వస్తారు. మూవీ రియల్ గా, రూటెడ్ గా, ఇంటెన్స్ గా , ఎమోషనల్ గా ఉంటుంది. నా టీమ్ అందరూ ప్యాషనేట్ గా వర్క్ చేశారు. హీరో దీక్షిత్, హీరోయిన్ రశ్మిక తమ పర్ ఫార్మెన్స్ తో కథకు లైఫ్ ఇచ్చారు. ఇలాంటి యాక్టర్స్ దొరకడం ఏ దర్శకుడికైనా అదృష్టమని చెప్పాలి. నేను మానిటర్ వెనకాల కూర్చుని వీళ్ల పర్ ఫార్మెన్స్ చూస్తూ ఎంజాయ్ చేశాను. ఈ సినిమాకు నేనే ఫస్ట్ ఆడియెన్ కావడం హ్యాపీగా ఉంది. సినిమాలో నేనూ ఒక రోల్ చేశాను. ఇది రెగ్యులర్ ఫార్మేట్ లవ్ స్టోరీ కాదు. జెన్యూన్ గా ఒక కథ చెప్పాలని మేమంతా ప్రయత్నించాం. ఇలాంటి మూవీస్ కు మీ సపోర్ట్ కావాలి. అన్నారు.

ప్రొడ్యూసర్ విద్యా కొప్పినీడి మాట్లాడుతూ - గీతా ఆర్ట్స్, రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా అంటే మీరంతా క్యూట్ లవ్ స్టోరీ ఎక్స్ పెక్ట్ చేసి ఉంటారు. కానీ ట్రైలర్ చూశాక మీకు అర్థమై ఉంటుంది ఇదొక డిఫరెంట్ లవ్ స్టోరీ. ప్రతి ఒక్క ప్రేక్షకుడి మనసుకు హత్తుకునేలా మూవీ ఉంటుంది.  ఇలాంటి మంచి కథ తీసుకొచ్చిన రాహుల్ కు థ్యాంక్స్. ఈ క్యారెక్టర్ ను రశ్మిక తప్ప మరో హీరోయిన్ ఇంత బాగా పర్ ఫార్మ్ చేయలేరు. ఆమె గురించి మరో సందర్భంలో మాట్లాడుతా. తను మమ్మల్ని ఇన్స్ పైర్ చేసేది. దీక్షిత్, రశ్మిక తమ పర్ ఫార్మెన్స్ లతో ఈ కథకు లైఫ్ ఇచ్చారు. నవంబర్ 7న మీ అందరినీ థియేటర్స్ లో కలుస్తాను. అన్నారు.
     
ప్రొడ్యూసర్ ధీరజ్ మొగిలినేని మాట్లాడుతూ - మేము ఏ సినిమాను రొటేషన్ కోసం చేయము. కథను నమ్మి ప్యాషనేట్ గా ప్రొడ్యూస్ చేస్తాం. కెరీర్ లో పది సినిమాలు చేసినా అవి గుర్తుండిపోవాలి అనుకుంటా. వాటిలో "ది గర్ల్ ఫ్రెండ్"  సినిమా ఫస్ట్ ప్లేస్ లో ఉంటుంది. ఈ కథ విన్నప్పుడు ఈ సినిమాను తప్పకుండా ప్రొడ్యూస్ చేయాలని అనుకున్నాం. ఈ జర్నీలో డైరెక్టర్ రాహుల్ మంచి మిత్రుడు, సోదరుడిలా మారిపోయారు. రశ్మిక గారు ఈ సినిమాను ఒప్పుకోవడమే మా మొదటి విజయం. రెమ్యునరేషన్ గురించి మాట్లాడాలని వెళితే, సినిమా కంప్లీట్ అయ్యాక తీసుకుంటా అన్నారు. అలాంటి సపోర్ట్ మరెవరూ ఇవ్వలేరు అనిపించింది. రశ్మిక లేకుంటే "ది గర్ల్ ఫ్రెండ్"  సినిమానే లేదు. దీక్షిత్ మాకు దొరికిన గొప్ప నటుడు. ఆయన టాలీవుడ్ లో "ది గర్ల్ ఫ్రెండ్" తర్వాత మరో పదేళ్లు వరుసగా సినిమాలు చేస్తారు. వీళ్లిద్దరు తమ పర్ ఫార్మెన్స్ తో ఆకట్టుకుంటారు. అల్లు అరవింద్ గారు లేకుంటే నేను లేను. ఆయన మాకు గాడ్ ఫాదర్. అన్నారు.

నిర్మాత బన్నీ వాస్ మాట్లాడుతూ - "ది గర్ల్ ఫ్రెండ్"  సినిమా నేను చూశాను. చివరి 30 నిమిషాల సినిమాను మర్చిపోలేకపోతున్నాను. రశ్మిక మా గీతా ఆర్ట్స్ గీత. ఈ సినిమాలో తను అద్భుతంగా పర్ ఫార్మ్ చేసింది. ఈ సినిమా చూశాక దీక్షిత్ ను కూడా మర్చిపోలేము. థియేటర్స్ లో కూర్చున్న అమ్మాయిల్లో 60 పర్సెంట్ ఈ కథకు బాగా కనెక్ట్ అవుతారు. ఇది మీరు బాగా కనెక్ట్ అయ్యే కథ. తమ గర్ల్ ఫ్రెండ్ తో ఈ సినిమాకు వెళ్లే అబ్బాయిలు జాగ్రత్తగా ఉండండి. ప్రొడ్యూసర్స్ విద్యా, ధీరజ్ ఈ చిత్రంతో మంచి పేరు తెచ్చుకుంటారు. వాళ్లకు అవార్డ్స్ కూడా వస్తాయి. అన్నారు.


హీరోయిన్ రశ్మిక మందన్న మాట్లాడుతూ - "ది గర్ల్ ఫ్రెండ్"  సినిమా కథ విన్నప్పుడు ఇలాంటి లవ్ స్టోరీని ఇప్పటిదాకా మనం చూడలేదు అనిపించింది. మనందరి జీవితాల్లో ఇలాంటివి జరుగుతాయి కదా అనే ఫీల్ కలిగింది. ఇందులో భూమా అనే పాత్రలో నటించాను. కేవలం బెస్ట్ ఫ్రెండ్స్ తోనే కొన్ని మన విషయాలు షేర్ చేసుకుంటాం. అలాంటి కంటెంట్ ఉన్న మూవీ ఇది. మా మూవీ ట్రైలర్ చూశారు కదా మీ అందరికీ నచ్చిందని నమ్ముతున్నా. నేను చాలా మూవీస్ చేస్తున్నా గానీ "ది గర్ల్ ఫ్రెండ్"  లాంటి సినిమా చేయడం ముఖ్యమని భావించాను. నాకు బాక్సాఫీస్ నెంబర్స్, సక్సెస్ కంటే మంచి మూవీ చేయాలి, మంచి కథను ఆడియెన్స్ కు చెప్పాలనే అనిపిస్తుంది. నా మూవీ థియేటర్స్ కు వెళ్లి చూసిన ఆడియెన్స్ ఏదో ఒక మంచి ఫీల్ తో బయటకు వెళ్లాలని కోరుకుంటాను. నేను నా కెరీర్ లో రైట్ టైమ్ లో కరెక్ట్ గా సెలెక్ట్ చేసుకున్న ప్రాజెక్ట్ ఇది. ఇలాంటి మంచి టీమ్ లేకుంటే మన డ్రీమ్స్ నిజం కావు. దీక్షిత్ లాంటి కోస్టార్ తో వర్క్ చేయడం హ్యాపీగా ఉంది. మీరంతా మా సినిమాను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా. అన్నారు.

నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ - "ది గర్ల్ ఫ్రెండ్"  సినిమా కథను రాహుల్ నాలుగేళ్ల క్రితం చెప్పాడు. ఆహాకు వెబ్ సిరీస్ లా చేయాలనే ప్లాన్ లో ఉన్నాడు. కానీ ఇలాంటి మంచి కథతో సినిమా చేస్తేనే బాగుంటుందని అనిపించేది. ఆ తర్వాత ఎప్పుడు కలిసినా ఈ కథ గురించి రాహుల్ కు గుర్తుచేసేవాడిని. ఈ కథలో హీరోయిన్ క్యారెక్టర్ చాలా ఇంటెన్స్ గా ఉంటుంది. అంత హెవీ పర్ ఫార్మెన్స్ ఎవరు చేస్తారని అనుకున్నప్పుడు రశ్మిక మాత్రమే చేయగలదు అని ఆమెను తీసుకున్నాం. తను నాకు కూతురు లాంటిది. రశ్మికకు ఈ సినిమాతో బెస్ట్ యాక్టర్ అవార్డ్స్ వస్తాయి. ఈ సినిమా చూశాకే దీక్షిత్ ఎంత మంచి పర్ ఫార్మర్ అనేది ఆడియెన్స్ తెలుసుకుంటారు. రశ్మిక, దీక్షిత్ తో ఒక ఇంటెన్స్ పర్ ఫార్మెన్స్ తీసుకున్నాడు రాహుల్. అతన్ని చూస్తే ఇలాంటి సినిమా ఇతను చేశాడా అనిపిస్తుంది. "ది గర్ల్ ఫ్రెండ్"  సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు విజయ్ దేవరకొండను గెస్ట్ గా తీసుకొద్దాం. అన్నారు.
Rashmika Mandanna
The Girlfriend
The Girlfriend trailer
Tollywood
Allu Aravind

More Press News