‘మిత్ర మండలి’ చిత్రం సెన్సార్ పూర్తి..

‘మిత్ర మండలి’  చిత్రం సెన్సార్ పూర్తి..
ప్రియదర్శి, నిహారిక ఎన్ ఎం హీరో హీరోయిన్లుగా విజయేందర్ దర్శకత్వంలో బీవీ వర్క్స్ బ్యానర్ మీద బన్నీ వాస్ సమర్పణలో సప్తాస్వ మీడియా వర్క్స్ మీద కళ్యాణ్ మంతెన, భాను ప్రతాప, డా. విజేందర్ రెడ్డి తీగల నిర్మించిన చిత్రం ‘మిత్ర మండలి’. ఈ మూవీ అక్టోబర్ 16న రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే రిలీజ్ చేసిన సాంగ్స్, టీజర్, ట్రైలర్ ఇలా అన్నీ కూడా వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఇక రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న క్రమంలో సెన్సార్ కార్యక్రమాల్ని కూడా చిత్రయూనిట్ పూర్తి చేసుకుంది.

‘మిత్ర మండలి’ ఆద్యంతం వినోదభరితంగా ఉందని, సమాజంలోని వ్యవస్థల  మీద సున్నితంగా విమర్శనాస్త్రాల్ని సంధించారని కొనియాడారు. ‘మిత్ర మండలి’ని బడ్డీ కామెడీ యాంగిల్‌లో చూపిస్తూనే మంచి సెటైరికల్ మూవీగా తెరకెక్కించారని అభినందించారు. అన్ని వర్గాల ప్రేక్షకులు చూడాల్సిన చిత్రమని ‘యు/ఎ’ సర్టిఫికెట్‌ను జారీ చేశారు. ఆద్యంతం అందరినీ ఆకట్టుకునేలా ‘మిత్ర మండలి’ని తెరకెక్కించారు.  

‘మిత్ర మండలి’ చిత్రంలో ప్రియదర్శి, నిహారిక ట్రాక్.. విష్ణు ఓయి, రాగ్ మయూర్, ప్రసాద్ బెహరా కామెడీ హైలెట్ కానుందని అర్థం అవుతోంది. ఇక స్పెషల్ అట్రాక్షన్‌గా వెన్నెల కిషోర్, సత్య, వీటీవీ గణేష్ పాత్రలు ఉండబోతోన్నాయి. అందరినీ సర్ ప్రైజ్ చేసేందుకు బ్రహ్మానందం కూడా కనిపించబోతోన్నారు. పాజిటివ్ బజ్ క్రియేట్ చేసిన ఈ మూవీని అక్టోబర్ 16న గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతోన్నారు.


Mithra Mandali
Priyadarshi
Niharika NM
Bunny Vas
Tollywood

Watch Today's Deals on Amazon

More Press News