నటుడు రామచంద్రను పరామర్శించిన మంచు మనోజ్
పక్షవాతం బారిన పడి గత కొద్దికాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్నారు నటుడు రామచంద్ర. అనారోగ్యంతో బాధపడుతున్న రామచంద్రను కలిసి ధైర్యం చెప్పారు మంచు మనోజ్. ఈ రోజు హైదరాబాద్ లో రామచంద్ర ఇంటికి వెళ్లి ఆయనను మంచు మనోజ్ పరామర్శించారు. రామచంద్రను అడిగి ఆయన ఆరోగ్య పరిస్థితిని మనోజ్ తెలుసుకున్నారు. కుటుంబ సభ్యులతో మనోజ్ మాట్లాడారు. రామచంద్ర అనారోగ్యం విషయం ఆయన సోదరుడి ద్వారా తెలిసిందని మనోజ్ అన్నారు. వెంకీ సినిమాలో నటనతో ప్రేక్షకులకు సుపరిచితమయ్యారు రామచంద్ర