పీవీఆర్ స్కూల్ శతాబ్ది ఉత్సవాలు.. కార్యాచరణ కోసం హైదరాబాద్‌లో పూర్వ విద్యార్థుల మీటింగ్

పీవీఆర్ స్కూల్ శతాబ్ది ఉత్సవాలు.. కార్యాచరణ కోసం హైదరాబాద్‌లో పూర్వ విద్యార్థుల మీటింగ్
ఒంగోలుకు చెందిన ప్రతిష్టాత్మక పీవీఆర్ మునిసిపల్ హైస్కూల్ వందేళ్ల చారిత్రక ప్రస్థానాన్ని పూర్తి చేసుకుంది. ఈ చారిత్రక మైలురాయిని పురస్కరించుకుని శతాబ్ది ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు పూర్వ విద్యార్థులు నడుం బిగించారు. ఇందులో భాగంగా, భవిష్యత్ కార్యాచరణ రూపకల్పన కోసం రేపు (ఆగస్టు 31, ఆదివారం) హైదరాబాద్‌లో ఒక కీలక సన్నాహక సమావేశం జరగనుంది.

ఈ సమావేశానికి హైదరాబాద్‌లోని ప్రముఖ డాక్టర్ రావు ఈఎన్‌టీ సూపర్ స్పెషాలిటీ ఇంటర్నేషనల్ హాస్పిటల్ వేదిక కానుంది. ఈ పాఠశాలలోనే విద్యాభ్యాసం చేసిన డాక్టర్ రావు, తాను చదువుకున్న బడికి గుర్తుగా ఈ కార్యక్రమానికి ఆతిథ్యం ఇవ్వడం విశేషం. ఆదివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఈ సమావేశం కొనసాగుతుంది. ఇందులో పూర్వ విద్యార్థులు, నిర్వాహకులు, కమిటీ సభ్యులు పాల్గొననున్నారు.

శతాబ్ది ఉత్సవాల విజన్, థీమ్, కమిటీల ఏర్పాటు, బాధ్యతల పంపకం వంటి కీలక అంశాలపై ఈ భేటీలో ప్రధానంగా చర్చించనున్నారు. దీంతో పాటు ఉత్సవాల ప్రచారం, స్పాన్సర్‌షిప్ వ్యూహాలు, కార్యక్రమాల టైమ్‌లైన్‌పై కూడా స్పష్టత తీసుకురానున్నారు. ఈ సమావేశం ద్వారా పూర్వ విద్యార్థులందరూ ఏకతాటిపైకి వచ్చి, తమ పాఠశాల శతాబ్ది ఉత్సవాలను చిరస్మరణీయంగా మార్చేందుకు ప్రణాళికలు రచిస్తున్నారని ఉత్సవాల కమిటీ కన్వీనర్ ఆరిగ వీర ప్రతాప్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ వేడుకలు కేవలం ఒక పండుగలా కాకుండా, తరతరాల విద్యార్థుల ప్రయాణానికి ప్రతీకగా నిలుస్తాయని ఆయన పేర్కొన్నారు.

అజెండా:
  • 10:00 – 10:10 AM : స్వాగతం & పరిచయం
  • 10:10 – 10:40 AM : శతాబ్ది ఉత్సవాల విజన్ & థీమ్
  • 10:40 – 11:10 AM : కమిటీలు & బాధ్యతలు
  • 11:10 – 11:25 AM : టీ విరామం
  • 11:25 – 12:10 PM : ప్రధాన ఉత్సవ అంశాలు
  • 12:10 – 12:40 PM : ప్రచారం & స్పాన్సర్‌షిప్ వ్యూహం
  • 12:40 – 1:10 PM : టైమ్‌లైన్ & మైలురాళ్లు
  • 1:10 – 1:50 PM : ఓపెన్ ఫోరం & కార్యాచరణ ప్రణాళిక
  • 1:50 – 2:00 PM : ముగింపు & దిశానిర్దేశం
  • 2:00 PM నుండి : భోజనం

PVR High School
Ongole

More Press News