సరిగమప లిటిల్ చాంప్స్ గ్రాండ్ లాంచ్ ఆగస్టు 30న, ప్రతి శనివారం రాత్రి 9 గంటలకు మీ జీ తెలుగులో!
హైదరాబాద్, 29 ఆగస్టు 2025: తెలుగు ప్రేక్షకులకు నిరంతరం వినోదాన్ని పంచడంలో ముందుండే ఛానల్ జీ తెలుగు. ఫిక్షన్, నాన్-ఫిక్షన్ షోలతో పాటు ప్రత్యేక కార్యక్రమాలతో వినోదం అందిస్తూనే ప్రతిభావంతులను వెలికితీయడంలోనూ ప్రముఖ పాత్ర పోషిస్తుంది. జీ తెలుగు సరిగమప కార్యక్రమం ద్వారా ఎంతోమంది గాయనీగాయకులను ప్రేక్షకులకు పరిచయం చేసింది. విజయవంతంగా 16 సీజన్లు పూర్తి చేసుకున్న జీ తెలుగు సరిగమప 17వ సీజన్ను ప్రారంభిస్తోంది. బాలగాయనీగాయకుల్లోని ప్రతిభను వెలికితీసే లక్ష్యంతో వస్తున్నసరిగమప లిటిల్ చాంప్స్ ఆగస్టు 30న ప్రారంభం, ప్రతి శనివారం రాత్రి 9 గంటలకు మీ జీ తెలుగులో మాత్రమే!
జీ తెలుగు సరిగమప లిటిల్ చాంప్స్ కార్యక్రమానికి ఎనర్జిటిక్ యాంకర్ సుధీర్ వ్యాఖ్యాతగా వ్యవహరించనుండగా, ప్రముఖ గాయని ఎస్పీ శైలజ, డైరెక్టర్ అనిల్ రావిపూడి, సినీ పాటల రచయిత అనంత శ్రీరామ్, మెగా డాటర్ నిహారిక కొణిదెల జడ్జీలుగా వ్యవహరించనున్నారు. ఈ సీజన్లో సంగీతంపై మక్కువగల పిల్లలు తమ ప్రతిభను నిరూపించుకుని టైటిల్ గెలుచుకోడానికి పోటీపడనున్నారు.
ఘనంగా ప్రారంభం కానున్న సరిగమప లిటిల్ చాంప్స్ లాంచ్ ఎపిసోడ్లోనే పిల్లలు తమ గాత్రంతో జడ్జీలు, ప్రేక్షకులను ఆకట్టుకోనున్నారు. అద్విత్ ‘చారుశీల’ పాటతోపాటు అమెరికా యాసలో డైలాగులు చెప్పి అందరినీ అలరించనున్నాడు. కృతి తన మధురమైన మరియు హాయిగొలిపే 'కోకిలమ్మ' పాటతో ఆకట్టుకుంటుంది. నిత్యశ్రీ 'మగాళ్లు వట్టి మాయగాళ్లే' పాటతో అందరి ప్రశంసలు అందుకొని షోలో స్థానం సంపాదించుకోనుంది. కేరళకు చెందిన అలియా ఫాతిమా 'సిరిమల్లె పువ్వా' పాటతో భాషా అడ్డంకులను సైతం అధిగమించి ఈ సీజన్లో చోటు దక్కించుకోనుంది. అధర్వ్ ‘దండాలయ్యా’ పాటతో వినాయక చవితి వేడుకను కళ్లముందుంచనున్నాడు. లక్ష్మీ చౌదరి రెండు వేరియేషన్స్లో పాటపాడి అందరినీ ఆశ్చర్యపరిచనుంది. అంతేకాదు, ప్రముఖ గాయని సమీరా భరద్వాజ్ తన కూతురుతో కలిసి ‘కథలెన్నో చెప్పారు’ పాట పాడటమే కాకుండా కామెడీ పంచులతో కడుపుబ్బా నవ్వించనున్నారు. మీరూ జీ తెలుగులో ప్రసారం కానున్న సరిగమప లిటిల్ చాంప్స్ గ్రాండ్ లాంచ్ ఎపిసోడ్ని మిస్ కాకుండా చూసేయండి!
జీ తెలుగు సరిగమప లిటిల్ చాంప్స్ ఆగస్టు 30న ప్రారంభం, ప్రతి శనివారం రాత్రి 9 గంటలకు.. తప్పక చూడండి!