జీ తెలుగు ఆధ్వర్యంలో జీ రైటర్స్ రూమ్ సెలక్షన్స్.. ఈ శనివారం మన హైదరాబాద్లో!

జీ తెలుగు ఆధ్వర్యంలో జీ రైటర్స్ రూమ్ సెలక్షన్స్.. ఈ శనివారం మన హైదరాబాద్లో!

హైదరాబాద్, 28 ఆగస్టు 2025: ఆసక్తికరమైన, ఆలోచనలు రేకెత్తించే కథలతో బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తున్న జీ తెలుగు ఔత్సాహిక రచయితలకు గొప్ప అవకాశాన్ని అందిస్తోంది.  జీ రైటర్స్ రూమ్ కేవలం ప్రతిభను వెలికితీసే ప్రయత్నం మాత్రమే కాదు—ఇది ‘యువర్స్ ట్రూలీ Z’ అనే కంపెనీ బ్రాండ్తో ప్రారంభమైన ఒక సృజనాత్మక ఉద్యమం. ఈ కార్యక్రమం జీ యొక్క అన్ని ప్లాట్‌ఫామ్‌లలో కథలను మరింత సమర్థవంతంగా మార్చడమే లక్ష్యంగా మొదలైంది. సరికొత్త దృక్పథాల కోసం పెరిగిన డిమాండ్ నేపథ్యంలోసృజనాత్మకత కలిగిన రచయితలను గుర్తించడంతోపాటు సృజనా సామర్థ్యంరచయితల వృత్తిగత ప్రపంచం మధ్య అంతరాన్ని తగ్గించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం. ఎంపికైన రచయితలకు విస్తృతమైన ‘Z’ సంస్థలోని టీవీడిజిటల్సినిమా ప్లాట్‌ఫామ్‌ల కోసం సమర్థవంతమైనఆకర్షణీయమైన కథలను రూపొందించే అవకాశం లభిస్తుంది. దేశవ్యాప్తంగా జరుగుతున్న జీ రైటర్స్ రూమ్ కార్యక్రమంలో భాగంగా జీ తెలుగు ఆగస్టు 30న హైదరాబాద్ వేదికగా  రచయితలను ఎంపిక చేయనుంది. 

 

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని తెలుగు రచయితలను ప్రోత్సహించడమే లక్ష్యంగా జీ తెలుగు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. జీ తెలుగులో రాబోయే సీరియల్స్కి బలమైన కథలను రాసే రచయితలతోపాటు సినిమా కథకులను సైతం ఎంపిక చేయనుంది. ఈ కార్యక్రమంలో పాల్గొనేవారు రాత పరీక్షలో పాల్గొనాల్సి ఉంటుంది. ఈ పరీక్షలో ఎంపికైన అభ్యర్థులు రైటర్స్ రూమ్లో చేరే అవకాశం లభిస్తుంది. ఈ జాబితాలో ఎంపికైన రచయితలకు పరిశ్రమ నిపుణులు రచనాశైలిలో మెలకువలు నేర్పిస్తారు. జీ నుంచి రాబోయే ప్రాజెక్టులలో ఈ రచయితలు భాగమయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పటికే జీ రైటర్స్ రూమ్ ఆధ్వర్యంలో నెల్లూరువిజయవాడవిశాఖపట్నం ప్రాంతాల్లో జరిగిన సెలక్షన్స్లో వందలాదిమంది ఔత్సాహిక రచయితలు పాల్గొని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు.   ప్రాంతం నలుమూలల నుండి ఆకాంక్షిత స్క్రీన్ రైటర్ల అసాధారణ ప్రతిభను మరియు సృజనాత్మకతను ప్రదర్శించాయి. రచనపై ఇష్టం ఉన్న చాలామంది ఈ కార్యక్రమంలో పాల్గొని తమ నైపుణ్యాలను మెరుగుపరచుకోవడంతో పాటు పరిశ్రమ నిపుణులతో సంబంధాలు ఏర్పరచుకున్నారు. ఔత్సాహికులను ప్రోత్సహించి భారతదేశానికి తర్వాతి తరం రచయితలను అందించడమే ఈ కార్యక్రమం ముఖ్యఉద్దేశం.

 

ఈ కార్యక్రమం గురించి జీ ఎంటర్‌టైన్‌మెంట్ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్‌జీ తెలుగుతమిళంకేరళం & ZEE5 చీఫ్ కంటెంట్ ఆఫీసర్  అనురాధ గూడురు మాట్లాడుతూ.. ‘జీ రైటర్స్ రూమ్ ఔత్సాహిక రచయితలు వారిలోని సృజనాత్మకతను వెలికితీసే ఒక అద్భుతమైన అవకాశం. ఈ కార్యక్రమం ద్వారా ఎంపికైన రచయితలు మా సంస్థలోని విభిన్న వేదికలపై రూపొందే సీరియల్స్సినిమాలువెబ్సిరీస్లకు కథలను అందిస్తారు. దేశవ్యాప్తంగా ఉన్న రచయితలు తమలోని ప్రతిభకు సానపెట్టి సరికొత్త కథలతో భవిష్యత్తుకు బాటలు వేసుకునే చక్కని అవకాశం. హైదరాబాద్లో ఈ శనివారం జరగనున్న సెలక్షన్స్ను తెలుగు రచయితలు సద్వినియోగపరుచుకోవాలి.’ అన్నారు.

హైదరాబాద్లో జరగనున్న జీ రైటర్స్ రూమ్ ఆడిషన్స్ వివరాలు:

 

వేదిక:

శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్సారథి స్టూడియోస్ ఎదురుగా

మెట్రో స్టేషన్ దగ్గరఅమీర్పేట్

హైదరాబాద్ - 500016  

ఫోన్ నెం: 9397397771  

తేదీ: ఆగస్టు 30, 2025   

సమయం: ఉదయం 9:00 గంటల నుండి మధ్యాహ్నం 2:00 గంటల వరకు  

 

తెలుగు కథల్లోని సాంస్కృతిక వైవిధ్యాన్నిభావోద్వేగాలను ప్రతిబింబించే కథకులను ప్రోత్సహించి వారిని శక్తివంతమైన రచయితలుగా తీర్చిదిద్దడమే  లక్ష్యంగా జీ తెలుగు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. సినిమా రచయితగా మారాలని కలలు కనే ఉత్సాహవంతులకు జీ తెలుగు అందిస్తున్న అద్భుత అవకాశం.. మీ కథలతో సిద్ధంగా ఉండండిసినీ రచయితగా  మారే అవకాశం అందుకోండి! మీరు zeewritersroom.com  వెబ్సైట్లో కూడా రిజిస్టర్ చేసుకోవచ్చు. 

 

రచయితగా నిరూపించుకునే సువర్ణావకాశం.. జీ రైటర్స్ రూమ్ సెలక్షన్స్ ఈ శనివారం, మన హైదరాబాద్లో!

 

Zee Telugu
Hyderabad

More Press News