శ్రీ కృష్ణ అవతార్ ఇన్ మహోబా

శ్రీ కృష్ణ అవతార్ ఇన్ మహోబా
అభయ్ చరణ్ ఫౌండేషన్' మరియు 'శ్రీజీ ఎంటర్‌టైన్‌మెంట్' సంయుక్తంగా ఒక చారిత్రక మహాకావ్యాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక టైటిల్‌ను తాజాగా అనౌన్స్ చేశారు. "శ్రీ కృష్ణ అవతార్ ఇన్ మహోబా" పేరుతో అనిల్ వ్యాస్ నిర్వహణ బాధ్యతలు చూసుకుంటుండగా, కథ, స్క్రీన్ ప్లే మరియు దర్శకత్వం ముకుంద్ పాండే వహిస్తున్నారు.

|ISKCON - ఢిల్లీకి చెందిన సీనియర్ ప్రీచర్ ‘జితామిత్ర ప్రభు శ్రీ’ ఆశీస్సులతో ఈ నవ్య కావ్యం రూపొందుతోంది. ఇది 11-12వ శతాబ్దాల నాటి 'మహోబా' సాంస్కృతిక వైభవాన్ని, అలాగే భగవాన్ శ్రీ కృష్ణుడి దివ్యత్వాన్ని, ధీరత్వాన్ని, ఆధ్యాత్మిక ప్రభావాన్ని చుపించాబోతుంది. చలన చిత్ర పరిశ్రమలో తొలిసారిగా శ్రీ కృష్ణుడిని ఒక యుద్ధవీరుడి పాత్రలో చూపించబోయే సినిమా ఇది.

'శ్రీ కృష్ణ అవతార్ ఇన్ మహోబా' ఒక పాన్-వరల్డ్ ప్రాజెక్ట్‌గా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకునేలా రూపొందుతోంది. ప్రపంచస్థాయి టెక్నీషియన్లతో తెరకెక్కుతున్న ఈ చిత్రం, చరిత్ర, సాంస్కృతిక వారసత్వం, ఆధ్యాత్మికతను కలగలుపుతుంది. ఈ ప్రకటనలో టైటిల్, నిర్మాణ సంస్థలు, మరియు క్రియేటివ్ టీమ్ వివరాలు వెల్లడించారు. నటీనటులు, సాంకేతిక బృందం మరియు ఇతర వివరాలు త్వరలో ప్రకటించబడతాయి.

20250815fr689f392e1f730.jpg.
Shri Krishna Avatar in Mahoba
ISKCON Delhi
Lord Krishna
AbhayCharan Foundation

More Press News