జీ తెలుగు వీకెండ్ వినోదం.. డ్రామా జూనియర్స్ 8 గ్రాండ్ ఫినాలే, జాబిలమ్మ నీకు అంత కోపమా జీ తెలుగు ప్రీమియర్

జీ తెలుగు వీకెండ్ వినోదం.. డ్రామా జూనియర్స్ 8 గ్రాండ్ ఫినాలే, జాబిలమ్మ నీకు అంత కోపమా జీ తెలుగు ప్రీమియర్
తెలుగు ప్రేక్షకులకు ఇరవై నాలుగు గంటలు నాన్స్టాప్ వినోదం అందించే జీ తెలుగు ఈ వారాంతంలో మరిన్ని ప్రత్యేక కార్యక్రమాలతో అలరించేందుకు సిద్ధమైంది. చిన్న పిల్లల్లోని టాలెంట్ని ప్రోత్సహిస్తూ వారి భవిష్యత్తుకు బాటలు చూపే సక్సెస్ఫుల్ రియాలిటీ షో డ్రామా జూనియర్స్ సీజన్ 8 తుది అంకానికి చేరుకుంది. ఆలోచింపజేసే స్కిట్స్, చిచ్చర పిడుగుల ప్రదర్శనతో ఆద్యంతం ఆసక్తికరంగా సాగిన డ్రామా జూనియర్స్ సీజన్ 8 గ్రాండ్ ఫినాలే రెండు భాగాలుగా ప్రసారం కానుంది. అంతేకాదు, కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ దర్శకత్వం వహించిన జాబిలమ్మ నీకు అంత కోపమా సినిమాని ఈ ఆదివారం ప్రసారం చేయనుంది జీ తెలుగు. డ్రామా జూనియర్స్ సీజన్ 8 గ్రాండ్ ఫినాలే పార్ట్ 1 ఆగస్టు 9 శనివారం రాత్రి 9 గంటలకు, 'జాబిలమ్మ నీకు అంత కోపమా' ఆదివారం సాయంత్రం 6 గంటలకు, మీ జీ తెలుగులో మాత్రమే!

జీ తెలుగు 'డ్రామా జూనియర్స్ సీజన్ 8' ఆరంభం నుంచీ అంతులేని వినోదం పంచుతూ ప్రేక్షకులను అలరిస్తోంది. 8 సీజన్లతో ఏళ్ల తరబడి అందరి హృదయాలను గెలుచుకున్న పాపులర్ కిడ్స్ రియాలిటీ షో తుది అంకానికి చేరుకుంది. ఎనర్జిటిక్ యాంకర్ సుధీర్ వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఈ కార్యక్రమంలో లాస్య, ఆషిక పదుకొనె గర్ల్స్, బాయ్స్ టీమ్స్కి మెంటర్లుగా వ్యవహరించారు. ఇక, ఈ సీజన్కి సినీ ప్రముఖులు డెరెక్టర్ అనిల్ రావిపూడి, నటి రోజా న్యాయనిర్ణేతలుగా వ్యవహరించగా ప్రతిభావంతులైన చిన్నారులు ఈ సీజన్ ఆద్యంతం ఆకట్టుకునే ప్రదర్శనలతో అలరించారు. ఈ గ్రాండ్ ఫినాలే పార్ట్ 1 ఎపిసోడ్ కూడా యాంకర్, జడ్జీలు, కంటెస్టెంట్ల గ్రాండ్ ఎంట్రీతోపాటు ఎన్నో అద్భుతమైన స్కిట్లతో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోనుంది. 

అంతేకాదు ఈ గ్రాండ్ ఫినాలేకి ముఖ్య అతిథులుగా హీరో తేజ సజ్జా, యాంకర్ ఉదయభాను, నటుడు సత్యరాజ్, మెగా డాటర్ కొణిదెల సుస్మిత వంటి సినీ ప్రముఖులు సందడి చేయనున్నారు. ఈ గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ ఆగస్టు 09న మొదటి భాగం, ఆగస్టు 16న రాత్రి 9 గంటలకు రెండవ భాగం ప్రసారం కానుంది. జీ తెలుగు డ్రామా జూనియర్స్ సీజన్ 8 టైటిల్ ఎవరు గెలుచుకున్నారో తెలుసుకోవాలంటే ఈ శనివారం, వచ్చే శనివారం ప్రసారమయ్యే డ్రామా జూనియర్స్ సీజన్ 8 గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్స్ తప్పకుండా చూడాల్సిందే!

అంతేకాదు, ఈ వారాంతపు వినోదంలో భాగంగా కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ దర్శకత్వం వహించిన ‘నీలవుక్కు ఎన్ మేల్ ఎన్నడి కోబం (NEEK)’ తెలుగు వెర్షన్ 'జాబిలమ్మ నీకు అంత కోపమా' సినిమాను జీ తెలుగు ప్రీమియర్గా అందిస్తోంది. చెఫ్ అవుదామనుకే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ యువకుడు ప్రభు (పవీష్ నారాయణ్) బాగా ధనవంతురాలైన తన ఫస్ట్ లవ్ నీలా(అనికా సురేంద్రన్) తో బ్రేకప్ తర్వాత పెళ్లి మీద ఇంట్రెస్ట్ లేకుండా ఉండిపోతాడు. కానీ తన స్కూల్ ఫ్రెండ్ ప్రీతీ (ప్రియా ప్రకాష్ వారియర్) పెళ్లి కూతురుగా తనకి సంబంధం వస్తుంది. 

అయితే తన మాజీ ప్రేయసిని మర్చిపోలేని సమయంలో ఆమె పెళ్లి శుభలేఖ ప్రభుకి అందుతుంది. అసలు వాళ్లిద్దరూ ఎందుకు విడిపోయారు? చివరికి ప్రభు ఎవరిని పెళ్లి చేసుకుంటాడు? అనే విషయాలు తెలియాలి అంటే జీ తెలుగు వేదికగా ఈ ఆదివారం ప్రసారమయ్యే జాబిలమ్మ నీకు అంత కోపమా సినిమా చూడాల్సిందే!

రొమాంటిక్ డ్రామాగా ఆకట్టుకున్న ఈ సినిమాలో పవీష్ నారాయణన్, అనికా సురేంద్రన్, ప్రియా ప్రకాష్ వారియర్ ప్రధాన పాత్రల్లో నటించగా మాత్యు థామస్, శరత్ కుమార్, రబియా ఖాతూన్, రమ్య రంగనాథన్, శరణ్య పొనవన్నన్ ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. జీ తెలుగు అందిస్తున్న ఈ వారాంతపు వినోదాన్ని మీరూ మిస్ కాకుండా చూసేయండి!

జీ తెలుగులో వారాంతపు వినోదం.. డ్రామా జూనియర్స్ గ్రాండ్ ఫినాలే పార్ట్-1 శనివారం రాత్రి 9 గంటలకు, 'జాబిలమ్మ నీకు అంత కోపమా' ప్రీమియర్ ఆదివారం సాయంత్రం 6 గంటలకు, తప్పక చూడండి!

20250808fr68959e1699339.jpg

More Press News