స్నేహితుల దినోత్సవం సందర్భంగా జీ తెలుగు ప్రత్యేక కార్యక్రమం ‘ప్రతిరోజూ పండగే’

స్నేహితుల దినోత్సవం సందర్భంగా జీ తెలుగు ప్రత్యేక కార్యక్రమం ‘ప్రతిరోజూ పండగే’
హైదరాబాద్, 01 ఆగస్టు 2025: అశేష ప్రేక్షకాదరణతో విజయవంతంగా కొనసాగుతున్న సీరియల్స్, ప్రత్యేక కార్యక్రమాలతో తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న ఛానల్ జీ తెలుగు.  రెట్టింపు వినోదాన్ని అందించడంతోపాటు ఎప్పటికప్పుడు ప్రత్యేక కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళ్లే జీ తెలుగు తాజాగా మిర్యాలగూడ వేదికగా అభిమానులకు అద్భుత అవకాశాన్ని అందించింది. స్నేహితుల దినోత్సవం సందర్భంగా జీ తెలుగు సీరియల్స్ ‘పడమటి సంధ్యారాగం’, ‘జగద్ధాత్రి’, ‘దీర్ఘసుమంగళీభవ’  నటీనటులు తమ అభిమానులను నేరుగా కలిసేందుకు ‘ప్రతిరోజూ పండగే’ పేరున ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించింది. అభిమాన ప్రేక్షకుల మధ్య కోలాహలంగా జరిగిన కార్యక్రమం ‘ప్రతిరోజూ పండగే’ ఈ ఆదివారం, ఆగస్టు 3న రాత్రి 7 గంటలకు మీ జీ తెలుగులో.. తప్పక చూడండి!

జీ తెలుగు ఇటీవల మిర్యాలగూడ వేదికగా ప్రముఖ నటీనటులతో ‘ప్రతిరోజూ పండగే’ కార్యక్రమాన్ని నిర్వహించి వీక్షకులకు ఆహ్లాదకరమైన అనుభవాన్ని అందించింది. స్నేహితుల దినోత్సవం సందర్భంగా ఘనంగా జరిగిన ఈ కార్యక్రమం ఆదివారం జీ తెలుగులో ప్రసారం కానుంది. మీ అభిమాన యాంకర్ రవి వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఈ కార్యక్రమం ఆద్యంతం ప్రేక్షకులకు వినోదం పంచింది. జీ తెలుగు ప్రేక్షకులను మెప్పిస్తూ విజయవంతంగా కొనసాగుతున్న ‘పడమటి సంధ్యారాగం’, ‘జగద్ధాత్రి’, ‘దీర్ఘసుమంగళీభవ’  సీరియల్స్ నటీనటులు ఈ వేదికపై నుంచి తమ అభిమానులతో సంభాషించి వారి సంతోషంలో పాలుపంచుకున్నారు. 

అద్భుత ప్రదర్శనలు, అభిమానుల కోలాహలంతో ఘనంగా జరిగిన ఈ కార్యక్రమంలో ఇరియా, రియాన్, పృథ్వీరాజ్ (శ్రీను), ప్రీతి శర్మ (ఆద్య), దీప్తి మన్నే (జగద్ధాత్రి), దర్శ్ చంద్రప్ప (కేదార్), మహీ గౌతమి (అహల్య), ప్రతాప్ (గౌతమ్), సాయి కిరణ్ (రఘురామ్), జయశ్రీ (జానకి), మనోజ్ (శౌర్య), సౌందర్య రెడ్డి (రామలక్ష్మి)తోపాటు మరికొందరు నటీనటులు సందడి చేశారు. స్నేహం గొప్పతనాన్ని, తమ స్నేహితులతో గల అనుబంధాన్ని అభిమానులతో పంచుకున్నారు. అలరించే ఆటపాటలు, సరదా సంభాషణలతో ఘనంగా జరిగిన ‘ప్రతిరోజూ పండగే’ వేడుకని జీ తెలుగు వేదికగా మీరూ మిస్ కాకుండా చూసేయండి!

మిర్యాలగూడలో ఘనంగా జరిగిన ‘ప్రతిరోజూ పండగే’ ప్రత్యేక కార్యక్రమం, ఈ ఆదివారం రాత్రి 7 గంటలకు మీ జీ తెలుగులో.. తప్పక చూడండి!


More Press News