సీఎం కేసీఆర్ జన్మదినోత్సవం సందర్భంగా టీ-శాట్ లో 66 మొక్కలు నాటిన సిబ్బంది

Related image

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు జన్మదినోత్సవం సందర్భంగా హైదరాబాద్ జూబ్లీహిల్స్ టీ-శాట్ కార్యాలయంలో హరితహారం నిర్వహించారు. ముఖ్యమంత్రి 66వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని కార్యాలయ ఆవరణలో సిబ్బంది 66 మొక్కలు నాటి వాటిని పెంచే బాధ్యతను స్వీకరిస్తామని ప్రతిజ్ఞ చేశారు.

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు జన్మదినోత్సవం సందర్భంగా టీ-శాట్ కార్యాలయ ఆవరణలో మొక్కలు నాటి హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించారు టీ-శాట్ సీఈవో ఆర్.శైలేష్ రెడ్డి. ముఖ్యమంత్రి పుట్టిన రోజు సందర్భంగా ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటాలని రాష్ట్ర మంత్రి కె.టి.రామారావు ఇచ్చిన పిలుపు మేరకు టీ-శాట్ కార్యాలయంలో హరితహారం కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా టీ-శాట్ కార్యాలయ ఆవరణలో సీఈవో సిబ్బందితో కలిసి 66 మొక్కలునాటించారు.

నాటిన మొక్కలను పెంచే బాధ్యతను చేపడతామని సిబ్బంది ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా సీఈవో శైలేష్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ సాధించి, సాధించిన తెలంగాణాను బంగారు తెలంగాణగా తయారు చేసే బాధ్యతను ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంధ్రశేఖర్ రావు భుజనా వేసుకున్నారని అన్నారు. ఆయన చేపట్టిన బంగారు తెలంగాణ నిర్మాణ బాటలో అందరూ కలిచి నడవాలని పిలుపునిచ్చారు. మొక్కలు నాటే కార్యక్రమంలో వి-హబ్ సీఈవో రావుల దీప్తి పాల్గొన్నారు.

నాటిన మొక్కలను తామే పెంచుతామని ప్రతిజ్ఞ చేసిన సిబ్బంది.

More Press Releases