సంగీత్‌ శోభన్‌ 'గ్యాంబ్లర్స్‌' ట్రైలర్‌ విడుదల

Related image

సంగీత్‌ శోభన్‌ కథానాయకుడిగా రూపొందుతోన్న చిత్రం 'గ్యాంబ్లర్స్‌'. ప్రశాంతి చారులింగా నాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో కేసీఆర్‌ ఫేమ్‌ రాకింగ్‌ రాకేష్‌ పృథ్వీరాజ్‌ బన్న, సాయి శ్వేత, , జస్విక, భరణి శంకర్‌, మల్హోత్త్ర శివ, శివారెడ్డి  ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. నిర్మాతలు సునీత, రాజ్‌కుమార్‌ బృందావనంలు  ఈ సినిమాను రేష్మాస్‌ స్టూడియోస్‌, స్నాప్‌ అండ్‌ క్లాప్‌ ఎంటర్‌టైన్‌ మెంట్‌ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కేఎస్‌కే చైతన్య ఈ చిత్రానికి దర్శకుడు. ప్రస్తుతం నిర్మాణానంతర పనులు తుదిదశకు చేరుకున్న ఈ చిత్రాన్ని జూన్‌ 6న ప్రపంచవ్యాప్తంగా థియేట్రికల్ రిలీజ్‌చేస్తున్నారు. 

కాగా ఈ చిత్రం ట్రైలర్‌ను ఆదివారం విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్మాత రాజ్‌ కుమార్‌ బృందావనం మాట్లాడుతూ '' గతంలో మా సంస్థలో  ప్రముఖ రచయిత విజయేంద్రప్రసాద్‌ దర్శకత్వంలో 'శ్రీవల్లి' అనే సినిమాను నిర్మించాం. తాజాగా మరో వైవిధ్యమైన కాన్సెప్ట్‌తో తాజాగా 'గ్యాంబ్లర్స్‌' చిత్రాన్ని నిర్మించాం. సినిమాలో అన్ని వర్గాలను అలరించే అంశాలున్నాయి. మాస్‌ అండ్‌ క్లాస్‌ ఎంటర్‌టైనర్‌గా అందరి మనసులను ఈ చిత్రం దోచుకుంటుంది' అన్నారు. మరో నిర్మాత సునీత మాట్లాడుతూ ''యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌గా అన్ని ఎమోషన్స్‌ ఈ చిత్రంలో ఉంటాయి. మా సంస్థ నుంచి రాబోతున్న మరో వైవిధ్యమైన చిత్ర. మా బ్యానర్ నుంచి కొత్త కాన్సెప్ట్‌లు చిత్రాలు అందించాలన్నదే మా లక్ష్యం. ఈ సినిమాలో డిఫరెంట్‌ సంగీత్‌ శోభన్‌ను చూడబోతున్నారు. ఆయన పర్‌ఫార్మెన్స్‌ కూడా చాలా కొత్తగా ఉంటుంది.  

సినిమాలోని ప్రతి పాత్ర, ప్రతి అంశం ఎంతో థ్రిల్లింగ్‌గా ఉంటుంది. నూతన ప్రతిభను ప్రోత్సాహించాలనే లక్ష్యంతో మా బ్యానర్‌లో సినిమాలు చేస్తున్నాం. మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ ఈ చిత్రాన్ని నైజాంలో విడుదల చేస్తున్నాం. ఆదిత్య మ్యూజిక్‌ ద్వారా మా పాటలను విడుదల చేశాం' అన్నారు. దర్శకుడు కేఎస్‌కే చైతన్య మాట్లాడుతూ '' ఈ చిత్ర కథ చెప్పగానే నిర్మాతలు ఎంతో ఎక్జ్సైట్ అయ్యారు. ఫుల్‌ ఫ్యాకేజీలా ఈ సినిమా ఉంటుంది. అన్ని ఎమోషన్స్‌ ఈ చిత్రంలో ఉంటాయి. కామెడీ, గ్లామర్‌, మిస్టరీ కలబోతగా ఈ సినిమా ఉంటుంది. సినిమా చూస్తున్నంత సేపు ఓ కొత్త లోకంలో ఉంటారు. సరికొత్తగా ప్రేక్షకులకు సరికొత్త ఎక్స్‌ పీరియన్స్‌ ఇస్తున్నాం. ఈ చిత్రంలో సంగీత్‌ శోభన్‌ పర్‌పార్మెన్స్‌ పొటెన్షియాలిటీని చూడబోతున్నారు అన్నారు. 






Gamblers
Sangeeth Shobhan
Gamblers trailer

More Press Releases