‘శంబాల : ఎ మిస్టికల్ వరల్డ్’ నుంచి ఇంద్రనీల్ పోషించిన మల్లేష్ పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ విడుదల

Related image

యంగ్ అండ్ వెర్సటైల్ హీరో ఆది సాయి కుమార్ నటిస్తున్న సూపర్ నేచురల్ థ్రిల్లర్ ‘శంబాల: ఎ మిస్టికల్ వరల్డ్’. ఇప్పటి వరకు ఈ ‘శంబాల’ నుంచి వచ్చిన పోస్టర్‌లు, పాత్రల్ని రివీల్ చేస్తున్న తీరు అందరిలోనూ ఆసక్తిని పెంచేసిన సంగతి తెలిసిందే. రీసెంట్‌గానే ‘శంబాల’ మేకింగ్ వీడియోని కూడా రిలీజ్ చేసి అంచనాలు పెంచేశారు. తాజాగా ఇంద్రనీల్ పోషించిన మల్లేష్ పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు.

ఈ పోస్టర్ అతన్ని భయంకరమైన, క్రూరమైన రీతిలో చూపిస్తోంది. వెనకాల ఉన్న ఊరి ప్రజల్ని చూస్తుంటే ఏదో విధ్వంసం సృష్టించినట్టుగానే కనిపిస్తోంది. పోస్టర్‌లతోనే సినిమా మీద ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తూ చిత్రయూనిట్ అందరినీ ఆకట్టుకుంటోంది. 

షైనింగ్ పిక్చర్స్ బ్యానర్ పై రాజశేఖర్ అన్నభీమోజు, మహీధర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి యుగంధర్ ముని దర్శకత్వం వహిస్తున్నారు.  ఈ చిత్రంలో అర్చన అయ్యర్, స్వాసిక, రవివర్మ, మధునందన్, శివకార్తీక్ వంటి వారు నటిస్తున్నారు. ఈ థ్రిల్లర్ మూవీ విడుదల తేదీని త్వరలో ప్రకటించే అవకాశం ఉంది.

Tollywood

More Press Releases