గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్, వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్, ఈ ఆదివారం సాయంత్రం 5:30 గంటలకు, మీ జీ తెలుగులో!

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన  గేమ్ ఛేంజర్,  వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్, ఈ ఆదివారం సాయంత్రం 5:30 గంటలకు, మీ జీ తెలుగులో!
హైదరాబాద్, 24 ఏప్రిల్ 2024: వారం వారం సరికొత్త సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్న జీ తెలుగు ఈ వారం మరో సూపర్ హిట్ సినిమాతో మీ ముందుకు రానుంది. థియేటర్, ఓటీటీలోనూ ప్రేక్షకులను ఆకట్టుకున్న సెన్సేషనల్ మూవీ గేమ్ ఛేంజర్. డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించిన ఈ సినిమాను వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్గా అందిస్తోంది జీ తెలుగు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, కియారా అద్వానీ జంటగా నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ గేమ్ ఛేంజర్ ఈ ఆదివారం (ఏప్రిల్ 27) సాయంత్రం 5:30 గంటలకు జీ తెలుగులో మాత్రమే!

ఈ చిత్రం విశాఖపట్నంలో కొత్తగా నియమితులైన కలెక్టర్ రామ్ నందన్ IAS (రామ్ చరణ్) చుట్టూ తిరుగుతుంది. అతని నిజాయితీ, అంకితభావం అతన్ని ముఖ్యమంత్రి సత్యమూర్తి (శ్రీకాంత్) కుమారుడైన బొబ్బిలి మోపిదేవి (ఎస్‌జె సూర్య)తో విభేదాలకు దారితీస్తుంది. మోపిదేవి అక్రమ కార్యకలాపాల్లో లీనమై ఉంటాడు. రామ్ తనకు ఎదురయ్యే సవాళ్లను ఎలా ఎదుర్కొంటాడు? రామ్ ముఖ్యమంత్రి అవుతాడా? మోపిదేవి తన ఆశయాల కోసం ఎంత దూరం వెళ్తాడు? అనే ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే ఈ ఆదివారం జీ తెలుగులో ప్రసారమయ్యే గేమ్ ఛేంజర్ సినిమా చూసేయండి!

ఈ సినిమాలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, కియారా అద్వానీ, ఎస్‌జె సూర్య, అంజలి, శ్రీకాంత్, సముద్రఖని వంటి ప్రముఖ నటీనటులు ముఖ్యపాత్రలు పోషించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై రూపొందిన ఈ సినిమాకి ఎస్ థమన్ సంగీతం అందించారు. ఆకట్టుకునే కథ, కథనం, భావోద్వేగాలు కలగలసిన యాక్షన్, పొలిటికల్ ఎంటర్టైనర్ గేమ్ ఛేంజర్ మీరూ మిస్ కాకండి!

జీ తెలుగు అందిస్తున్న వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గేమ్ ఛేంజర్, ఈ ఆదివారం సాయంత్రం 5:30 గంటలకు, తప్పక చూడండి!

Ramcharan

Watch Today's Deals on Amazon

More Press News