బిర్లా ఓపస్ పెయింట్స్ వినూత్నమైన పెయింట్ స్టూడియోను ప్రారంభించింది. ఇది మీ అన్ని పెయింటింగ్ అవసరాలకు గమ్యస్థానంగా ఉంటుంది.

• ప్రధానంగా వినియోగదారుని అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని రూపొందించిన ఈ పెయింట్ స్టూడియో భారతదేశంలో తనదైన శైలిలో కంపెనీ యాజమాన్యంలోని, కంపెనీ నిర్వహణలో ఉన్న మొట్టమొదటి స్టోర్‌ను ప్రారంభించింది
• బిర్లా ఓపస్ పెయింట్ స్టూడియో ఆవిష్కరణను, పర్సనలైజేషన్ను మిళితం చేస్తుంది. ఇంటి అలంకరణ దృక్పథాలకు జీవం పోసేందుకు నిపుణుల మార్గదర్శకత్వాన్ని, లీనమయ్యే స్పేస్‌లను అందిస్తుంది
ఇండియా, 07 మార్చి 2025, ముంబయి: ఆదిత్య బిర్లా గ్రూప్‌లోని గ్రాసిమ్ ఇండస్ట్రీస్‌లో భాగమైన బిర్లా ఓపస్ పెయింట్స్ తన మొట్టమొదటి బిర్లా ఓపస్ పెయింట్ స్టూడియో (కంపెనీ యాజమాన్యంలోని, కంపెనీ నిర్వహణలో ఉన్న స్టోర్)ను నేడు ఆవిష్కరించింది. వినియోగదారులు రంగులను ఎలా అన్వేషించాలి, ఎంచుకోవాలో పునర్నిర్వచించే పరిశ్రమలో మొట్టమొదటి అనుభవ కేంద్రంగా దీన్ని తీర్చిదిద్దారు. ఈ మైలురాయి ఆవిష్కరణ, ప్రీమియం ఆఫర్‌లు, నిజంగా లీనమయ్యే వినియోగదారుని అనుభవం ద్వారా పెయింట్, అలంకరణ పరిశ్రమను మార్చేందుకు బ్రాండ్ నిబద్ధతను సూచిస్తుంది. నేడు గురుగ్రామ్‌లో ప్రారంభమైన ఈ కేంద్రం, వినియోగదారుల కోసం ప్రత్యేకమైన ఎంపికల ఎంపికతో 170 ఉత్పత్తులను కలిగి ఉంది. భారతదేశం వ్యాప్తంగా తన రిటైల్ పాదముద్రను విస్తరించే లక్ష్యంతో కంపెనీ వృద్ధి వ్యూహంలో ఒక ముఖ్యమైన అడుగు. అనుభవపూర్వక రిటైల్‌పై దృష్టి సారించి, రాబోయే నెలల్లో న్యూఢిల్లీ, ముంబయి, నవీ ముంబయి, బెంగళూరు, హైదరాబాద్, కోల్‌కతా, లక్నో, జైపూర్, అహ్మదాబాద్ మరియు సూరత్‌లలో అదనపు అనుభవ కేంద్రాలను ప్రారంభించాలని కంపెనీ యోచిస్తోంది. ఇవన్నీ భారతదేశంలో రెండవ అతిపెద్ద అలంకరణ పెయింట్స్ బ్రాండ్‌గా అవతరించాలనే లక్ష్యంతో కంపెనీ ఏర్పాటు చేస్తోంది.
దీని గురించి బిర్లా ఓపస్ పెయింట్స్ సీఈఓ రక్షిత్ హర్గవే మాట్లాడుతూ, ‘‘నేడు, గురుగ్రామ్‌లో మా మొదటి బిర్లా ఓపస్ పెయింట్ స్టూడియోను మేము ప్రారంభించడం ద్వారా, భారతదేశం రంగులను ఎలా అనుభవిస్తుందో పునర్నిర్వచించేందుకు మేము నిర్ణయాత్మక అడుగు వేస్తున్నాము. భారతదేశంలోని వినియోగదారులు ఉత్పత్తులను కొనుగోలు చేసేటప్పుడు లేదా సేవలను పొందేటప్పుడు కొత్త మరియు మరింత లోతైన ఎంపికలను అన్వేషించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. వినియోగదారుల ప్రవర్తనలో ఈ మార్పును గుర్తించి, బిర్లా ఓపస్ పెయింట్స్‌లో మేము గృహయజమానులకు వారి స్వంత కథలను రూపొందించుకునేందుకు సాధికారత ఇచ్చేలా లీనమయ్యే ప్రదేశాలను సృష్టిస్తున్నాము’’ అని వివరించారు.
ఆయన మరింత వివరిస్తూ ‘‘ఈ అనుభవ కేంద్రం శ్రేష్ఠత, ఆవిష్కరణ, రాజీలేని నాణ్యత పట్ల మా శాశ్వత నిబద్ధతకు మరియు ప్రతి ఇంటికి వ్యక్తిగతీకరించిన స్పర్శ అవసరమనే మా నమ్మకానికి నిదర్శనం’’ అన్నారు. ‘‘ఈ కేంద్రంలో మేము 170 ఉత్పత్తులను, మరికొన్ని ప్రత్యేకమైన ఎంపికలను అందిస్తున్నాము. దీని ద్వారా వినియోగదారులు మా పెయింట్స్, డిజైనర్ ఫినిషింగ్‌లు, వాల్‌పేపర్‌లతో పూర్తిగా కొత్త మరియు ప్రత్యేకమైన రీతిలో నిమగ్నమవ్వడానికి వీలు కల్పిస్తున్నాము. పెయింటింగ్‌ను ఒక సాధారణ పని కన్నా ఎక్కువగా చేయాలని, దానిని వ్యక్తిగత కథలను ప్రతిబింబించే ప్రదేశాలను మార్చే కళగా మార్చాలని మేము లక్ష్యంగా పెట్టుకున్నాము. ఈ విస్తరణ భారతదేశంలో రెండవ అతిపెద్ద అలంకరణ పెయింట్ బ్రాండ్‌గా అవతరించేందుకు మా ప్రయాణంలో కీలకమైన అడుగును సూచిస్తుంది. ఇది వినియోగదారులకు ఆవిష్కరణ, సౌలభ్యం మరియు శ్రేష్ఠతను నిర్ధారిస్తుంది’’ అని వివరించారు.
కొత్తగా ప్రారంభించించిన స్టోర్ వివరాలు:
స్టోర్ చిరునామా - బిర్లా ఓపస్, స్కో-306, సెక్టార్-29, గుర్‌గావ్- 122 001
ప్రతి బిర్లా ఓపస్ పెయింట్ స్టూడియో ఆర్కిటెక్ట్‌లు, ఇంటీరియర్ డిజైనర్లకు కేంద్రంగా పనిచేస్తుంది. వారి కోసం ప్రత్యేక వర్క్‌స్పేస్ వనరులు, నమూనాలు, నిపుణుల మద్దతుతో నిపుణులు సులభంగా సహకరించేందుకు మరియు సృష్టించడానికి వీలు కల్పిస్తుంది. అనుభవ కేంద్రం మా పెయింట్ క్రాఫ్ట్ పెయింటింగ్ సేవ ద్వారా పెయింటింగ్ సేవలనూ అందిస్తుంది. అయితే ప్రతి పెయింట్ స్టూడియో స్థానిక సంస్కృతి, వారసత్వం మరియు వాస్తుశిల్పం నుంచి ప్రేరణ పొందిన షేడ్స్‌ను కూడా కలిగి ఉంటుంది.
About Birla Opus Paints:
Birla Opus Paints, housed under Grasim Industries, Aditya Birla Group’s flagship firm, offers Decorative Painting Solutions to consumers in India. Launched in 2024, Birla Opus Paints has a complete portfolio featuring a range of superior products across categories like interiors, exteriors, waterproofing, enamel paints, wood finishes, and wallpapers. With six manufacturing plants spread across India, Birla Opus Paints is well positioned to be amongst the market leaders in the decorative paints category. The brand aims to inspire people to turn their surrounding spaces into their very own masterpiece.