హైదరాబాద్‌లో సౌదీ ఫిలిమ్ నైట్స్ - సౌదీ ఫిలిమ్స్ ప్రదర్శన

హైదరాబాద్‌లో సౌదీ ఫిలిమ్ నైట్స్ -  సౌదీ ఫిలిమ్స్ ప్రదర్శన
విలక్షణ కథనాంశంతో సౌదీ ఫిలిం కమిషన్ నిర్మించిన చిత్రాలను బంజారాహిల్స్‌లో ఆర్కే పివిఆర్‌లో ప్రదర్శించారు. సౌదీ అరేబియా, భారతదేశాల మధ్య సాంస్కృతిక సంబంధాలను బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు డోమ్ ఎంటర్టైన్మెంట్స్ మహమ్మద్ మొరాని తెలిపారు. డోమ్ ఎంటర్‌టైన్‌మెంట్, కళారాజ్ మీడియా & ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమం అద్భుతమైన విజయాన్ని సాధించింది. పెద్ద సంఖ్యలో ప్రేక్షకులు విచ్చేసి లఘు చిత్రాలను వీక్షించి ఆనందించారు.

శ్రీ మహమ్మద్ మొరానీ, శ్రీమతి లక్కీ మొరానీ, మిస్టర్ మజర్ నదియాడ్‌వాలా మరియు మిస్టర్ అలీమ్ మొరానీ వంటి వారు అతిథుల్ని ఘనంగా స్వాగతించారు. సౌదీ ఫిల్మ్ నైట్స్ - సౌదీ సినిమా కళాత్మక నైపుణ్యతను హైలైట్ చేస్తూ సౌదీ అరేబియా, భారతదేశం మధ్య సాంస్కృతిక బంధాన్ని పెంపొందించే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమం ద్వారా సౌదీ చలనచిత్ర నిర్మాణం, వారి నైపుణ్యతను అందరికీ తెలియజేశారు. సౌదీ, భారతీయ చలనచిత్ర పరిశ్రమల మధ్య సినిమా సంబంధాలను మరింత బలోపేతం చేస్తూ, రెండు దేశాల మధ్య భవిష్యత్తులో సహకారానికి మార్గం సుగమం చేసేలా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
Saudi Film Nights
Soudi Films
Hyderabad

More Press News