హైదరాబాద్: మాదాపూర్ లోని పశు వైద్యశాలను పరిశీలించిన మంత్రి తలసాని

Related image

విజయ డెయిరీ ఉత్పత్తులను ప్రజలకు మరింత అందుబాటులోకి తీసుకెళ్లేందుకు నూతనంగా పెద్ద ఎత్తున  ఔట్ లెట్ లను ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమాభివృద్ధి,  సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు.

బుధవారం మాదాపూర్ లోని పశు వైద్యశాలను ఆయన పరిశీలించారు. పశుసంవర్ధక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అధర్ సిన్హా, డైరెక్టర్ లక్ష్మారెడ్డి, విజయ డెయిరీ MD శ్రీనివాస్ రావు, రంగారెడ్డి జిల్లా dvaho విజయ కుమార్ రెడ్డి ఉన్నారు. విజయ డెయిరీ ఉత్పత్తులకు ప్రజలలో ఎంతో ఆదరణ ఉందని, కానీ కొన్ని ప్రాంతాలలో మాత్రమే ప్రజలకు అందుబాటులో ఉన్నాయని ఆయన అన్నారు.

అన్ని ప్రాంతాలలోని ప్రజలకు చేరువ చేయాలనే ఉద్దేశ్యంతో నగరంలో విజయ డెయిరీ ఉత్పత్తుల విక్రయాల కోసం నూతనంగా ఔట్ లెట్ లను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ప్రజల నుండి కూడా తమ ప్రాంతాల లో ఔట్ లెట్ లను ఏర్పాటు చేయాలని డిమాండ్లు వస్తున్నాయని తెలిపారు. మాదాపూర్ ప్రాంత ప్రజలకు కూడా విజయ ఉత్పత్తులను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఇక్కడ (పశువైద్యశాల పక్కనే) నూతన ఔట్ లెట్ ను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. గతంలో ఉన్న ప్రభుత్వాల నిర్లక్షం కారణంగా విజయ డెయిరీ అభివృద్దికి నోచుకోలేదని అన్నారు.

తెలంగాణ ఏర్పడిన తర్వాత విజయ డెయిరీని ఎంతో అభివృద్ధి చేయడం జరిగిందని పేర్కొన్నారు. విక్రయాలను పెంచడంతో పాటు అందుకు అనుగుణంగా ఉత్పత్తి సామర్ద్యం కూడా పెంచేందుకు చర్యలు చేపట్టినట్లు చెప్పారు. తార్నాక లో ప్రస్తుతం ఉన్న డెయిరీ ని మెగా డెయిరీ గా విస్తరించనున్నట్లు తెలిపారు. పాల సేకరణ పెంపుకోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని వివరించారు.

పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో డెయిరీ ఫామ్ ల వద్దకే వెళ్ళి వైద్యసేవలను అందిస్తున్నట్లు ఆయన చెప్పారు. పశుసంవర్ధక, డెయిరీ అధికారులు సమన్వయంతో పనిచేసి పాల సేకరణను పెంచేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు తెలిపారు. ఇటీవల జరిగిన మేడారం జాతరలో విజయ డెయిరీ కేంద్రాల ద్వారా సుమారు 18 లక్షల రూపాయల విజయ  ఉత్పత్తులను విక్రయించినట్లు చెప్పారు. అదేవిధంగా నుమాయిష్ ఎగ్జిబిషన్ లో ఏర్పాటు చేసిన కేంద్రాల ద్వారా 40 లక్షల రూపాయల విజయ ఉత్పత్తుల  విక్రయాలు జరిపినట్లు తెలిపారు. 

More Press Releases