తనికెళ్ల భరణి ప్రధాన పాత్రలో ‘అసుర సంహారం’

తనికెళ్ల భరణి ప్రధాన పాత్రలో ‘అసుర సంహారం’
750 చిత్రాలకు పైగా నటించి మెప్పించిన తనికెళ్ల భరణి ప్రస్తుతం ప్రధాన పాత్రలో ‘అసుర సంహారం’ అనే చిత్రాన్ని చేస్తున్నారు. క్రైమ్‌ సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా రూపొందనున్న ఈ మూవీని శ్రీ సాయి ప్రవర్తిక బోయళ్ళ సమర్పణలో శ్రీ సాయి తేజో సెల్యూలాయిడ్స్ బ్యానర్ మీద సాయి శ్రీమంత్, శబరిష్ బోయెళ్ళ నిర్మించనున్నారు. ఈ మూవీకి కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం ఇలా అన్నింటిని కిషోర్ శ్రీకృష్ణ హ్యాండిల్ చేయనున్నారు.

అసుర సంహారం సినిమాలో తనికెళ్ల భరణితో పాటుగా.. మిధున ప్రియ ప్రధాన పాత్రలో నటించనున్నారు. విలేజ్ క్రైమ్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్  పనులు శరవేగంగా  జరుగుతున్నాయి. ఈ సినిమాలో ఇతర తారాగణం గురించి, ఇతర వివరాల గురించి త్వరలోనే ప్రకటించనున్నారు. ఈ మూవీలో తనికెళ్ల భరణి విలేజ్ డిటెక్టివ్‌గా ఓ విభిన్నమైన  పాత్రలో ప్రేక్షకులను అలరించనున్నారు.


Tanikella Bharani
Asura Samharam
Tollywood

More Press News