హారిత హారంలో పాల్గొందాం: పోలీస్ శాఖ ఉన్నతాధికారులకు తెలంగాణ డీజీపీ ఆదేశం

Related image

తెలంగాణకు హరిత హారంలో భాగంగా పోలీస్ శాఖ లోని ఉన్నతాధికారి నుండి హోమ్ గార్డ్ వరకు ప్రతీ ఒక్కరు కనీసం ఒక మొక్కైనా నాటాలని డీ.జీ.పీ మహేందర్ రెడ్డి ఆదేశాలు జారీచేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని హరితమయంగా రూపొందించేందుకు చేపట్టిన హరితహారంలో అన్ని ప్రభుత్వ శాఖలు, పౌరులు పెద్దఎత్తున పాల్గొంటున్నారని, దీనిలో భాగంగానే రాష్ట్రంలో గ్రీన్ కవరేజ్ పెంపొందించేందుకు గాను పోలీస్ శాఖలోని ప్రతి ఒక్క ఉన్నతాధికారి నుండి హోమ్ గార్డ్ వరకు విధిగా తమ పరిధిలోని ప్రభుత్వ స్థలాలలో గాని ప్రయివేట్ స్థలాల్లో గాని కనీసం ఒక మొక్క నాటాలని పేర్కొన్నారు.

పోలీస్ శాఖలో ప్రస్తుతం ఉన్న పోలీస్ అధికారులు, సిబ్బంది, హోమ్ గార్డుల తోపాటు ఇటీవల కొత్తగా నియామకమై  వివిధ శిక్షణా కేంద్రాల్లో శిక్షణ పొందుతున్నదాదాపు పది వేల మంది రిక్రూటీలు కూడా ఈ మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొనాలని స్పష్టంచేశారు. తెలంగాణాకు హరిత హారం కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు గాను ప్రతీ ఒక్క పోలీస్ అధికారి వ్యక్తిగతంగా శ్రద్ధ చూపించాలని, ఈ కార్యక్రమ నిర్వహణపై నివేదికలను పోలీస్ చీఫ్ కార్యాలయానికి పంపాలని డీ.జీ.పీ కార్యాలయం నేడు విడుదల చేసిన సర్క్యులర్ లో పేర్కొన్నారు.

More Press Releases