"డ్రింకర్ సాయి" మూవీ ఫస్ట్ లుక్, టైటిల్ లాంఛ్

Related image

ధర్మ, ఐశ్వర్య శర్మ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా "డ్రింకర్ సాయి". బ్రాండ్ ఆఫ్ బ్యాడ్ బాయ్స్ అనేది ఈ చిత్ర ట్యాగ్ లైన్. ఈ చిత్రాన్ని ఎవరెస్ట్ సినిమాస్, స్మార్ట్ స్క్రీన్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై బసవరాజు శ్రీనివాస్, ఇస్మాయిల్ షేక్, బసవరాజు లహరిధర్ నిర్మిస్తున్నారు. కొన్ని వాస్తవ ఘటనల ఆధారంగా దర్శకుడు కిరణ్ తిరుమలశెట్టి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.

ఈ రోజు "డ్రింకర్ సాయి" సినిమా ఫస్ట్ లుక్, టైటిల్ ను స్టార్ డైరెక్టర్ మారుతి లాంఛ్ చేశారు. "డ్రింకర్ సాయి" ఫస్ట్ లుక్, టైటిల్ ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయని ప్రశంసించిన మారుతి మూవీ టీమ్ కు తన బెస్ట్ విశెస్ అందించారు. త్వరలోనే "డ్రింకర్ సాయి" సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది.

నటీనటులు - ధర్మ, ఐశ్వర్య శర్మ, పోసాని కృష్ణమురళి, శ్రీకాంత్ అయ్యంగార్, సమీర్, ఎస్ఎస్ కాంచి, భద్రం, కిర్రాక్ సీత, రీతు చౌదరి, ఫన్ బకెట్ రాజేశ్, రాజ ప్రజ్వల్, తదితరులు




Drinker sai
Maruthi
Cinema

More Press Releases