ఆసక్తికరంగా 'భవానీ వార్డ్ 1997’ టీజర్‌

ఆసక్తికరంగా 'భవానీ వార్డ్ 1997’ టీజర్‌
హారర్‌ సస్పెన్స్‌ కథాంశంతో రూపొందుతున్న చిత్రం భవానీ వార్డ్‌ 1997. జీడీఆర్ మోషన్ పిక్చర్, విభూ మీడియా సమర్పణలో చంద్రకాంత సోలంకి, జీడీ నరసింహా నిర్మించిన ఈ మూవీకి జీడీ నరసింహా దర్శకత్వం వహించారు. 

ఈ చిత్రంలో గాయత్రీ గుప్తా, గణేష్ రెడ్డి, పూజా కేంద్రే, సాయి సతీష్, జబర్దస్త్ అప్పారావు, ఈశ్వర్ బాబు ధూళిపూడి తదితరులు నటించిన ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్లు, ఫస్ట్ లుక్‌లు ఇలా అన్నీ కూడా అందరినీ ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ మూవీ టీజర్‌ను సత్యం రాజేష్ విడుదల చేశారు. అనంతర సత్యం రాజేష్ మాట్లాడుతూ.. టీజర్ చాలా బాగుందని చెబుతూ టీంకు ఆల్ ది బెస్ట్ తెలిపారు.

గాడ్ విల్ ప్రకారం.. మనిషి చనిపోయిన తరువాత సోల్ ఆ దేవుడి దగ్గరకు వెళ్లాలి.. అలా వెళ్లకపోతే.. ఆ సోల్ ఈవిల్ స్పిరిట్‌గా మారిపోతుంది అనే డైలాగ్స్‌తో ప్రారంభమైన టీజర్.. ఆద్యంతం భయపెట్టేలా ఉంది. ఆ ఆత్మ ఏంటి? ఆ క్రైమ్ ఏంటి? అసలు ఇందులో సైకో విలన్ ఎవరు? అసలు ఏం జరుగుతోంది? అనే ప్రశ్నలు తలెత్తేలా టీజర్‌ను కట్ చేశారు.

గాయత్రీ గుప్తా, గణేష్ రెడ్డి, పూజా కేంద్రే, సాయి సతీష్, జబర్దస్త్ అప్పారావు, ఈశ్వర్ బాబు ధూళిపూడి తదితరులు నటించిన ఈ మూవీకి అరవింద్ బి కెమెరామెన్‌గా పని చేసారు. త్వరలో ఈ చిత్రానికి సంబంధించిన రిలీజ్ డేట్‌ను ప్రకటించనున్నారు.


Bhavani Ward 1997
Tollywood

Watch Today's Deals on Amazon

More Press News