మర్డర్‌ మిస్టరీగా విజయ్‌ ఆంటోని ‘గగన మార్గన్’

మర్డర్‌ మిస్టరీగా విజయ్‌ ఆంటోని  ‘గగన మార్గన్’
నటుడిగానే కాకుండా దర్శకుడిగా, గీతరచయితగా, సంగీత దర్శకుడిగా అందరికి సుపరిచితుడైన విజయ్‌ ఆంటోని తాజాగా ఓ మర్డర్‌ మిస్టరీ క్రైమ్‌ థ్రిల్లర్‌లో నటిస్తున్నాడు. డిటెక్టివ్‌ ఫిక్షన్‌ కథగా రూపొందనున్న ఈ చిత్రాన్ని విజయ్ ఆంటోని ఫిలింస్ కార్పొరేషన్ బ్యానర్‌పై మీరా విజయ్ ఆంటోని సగర్వంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి లియో జాన్ పాల్ దర్శకత్వం వహించారు. 

ఈ మూవీ  టైటిల్‌ను తాజాగా రివీల్ చేశారు. ‘గగన మార్గన్’ అంటూ రిలీజ్ చేసిన టైటిల్ పోస్టర్ అందరినీ ఆకట్టుకుంటోంది. ఫస్ట్ లుక్ పోస్టర్‌లో విజయ్ ఆంటోని రెండు రకాలుగా కనిపించారు. గాయపడి ఇంటెన్స్ లుక్‌లో కనిపించిన విజయ్ లుక్ కొత్తగా ఉంటే.. నీటి అడుగు బాగాన ఉన్న వ్యక్తి పోస్టర్ కూడా ఇందులో కనిపిస్తోంది. ప్రముఖ ఎడిటర్‌  లియో జాన్ పాల్.. ‘గగన మార్గన్’తో దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. త్వరలో చిత్రాన్నిప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుక సన్నాహాలు చేస్తున్నారు. 
.
Vijay Antony
Gagana Maargan
Gagana Maargan first look

More Press News