హీరో విశ్వ కార్తికేయ కొత్త చిత్రం ప్రారంభం

హీరో విశ్వ కార్తికేయ కొత్త చిత్రం ప్రారంభం
కలియుగ పట్టణం ఫేమ్‌ విశ్వ కార్తికేయ నటిస్తున్న నూతన చిత్రం దసరా పర్వదినాన ప్రారంభమైంది.  ఆయుషి పటేల్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి పి.చలపతి దర్శకుడు. అమరావతి టూరింగ్ టాకీస్ నిర్మాణంలో ఈ చిత్రం నిర్మాణం జరుపుకుంటోంది. కాగా ఈ చిత్రం ముహూర్తం సన్నివేశానికి ముఖ్య అతిథులు హీరో సుమన్ క్లాప్ కొట్టారు. 

సీనియర్ డైరెక్టర్ కాశీ విశ్వనాథ్ గారు గౌరవ దర్శకత్వం వహించారు. డైరెక్టర్ చంద్ర మహేష్ కెమెరా స్విచ్ ఆన్ చేయగా.. సీనియర్ దర్శకులు సముద్ర, సి.ఎల్. శ్రీనివాస్ గారు, కోటిబాబు గారు స్క్రిప్ట్‌ను అందించారు. మిగిలిన వివరాలను చిత్రయూనిట్ త్వరలోనే ప్రకటించనుంది.

ఈ చిత్రానికి పోలాకి విజయ్ డ్యాన్స్ కొరియోగ్రాఫర్‌గా పని చేయనున్నారు. యెలేందర్ మహావీర్ సంగీతాన్ని అందించనుండగా.. కిషోర్ బోయిడపు కెమెరామెన్‌గా పని చేయనున్నారు. తారక్ (ఎన్టీఆర్) ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వర్తించనున్నారు. ఈ మూవీకి సంబంధించిన ఇతర వివరాలను త్వరలోనే ప్రకటించనున్నారు.
Vishva Karthikeya
Vishva Karthikeya new film
Tollywood

More Press News