ఆత్మహత్యలు సమస్యలకు పరిష్కారం కాదు: 'కలి' దర్శకుడు శివ శేషు

ఆత్మహత్యలు సమస్యలకు పరిష్కారం కాదు: 'కలి' దర్శకుడు శివ శేషు
ప్రిన్స్, నరేష్ అగస్త్య నటిస్తున్న సినిమా "కలి". ఈ చిత్రాన్ని రచయిత కె.రా‌ఘవేంద్ర రెడ్డి సమర్పణలో “రుద్ర క్రియేషన్స్” సంస్థ నిర్మిస్తోంది. శివ శేషు దర్శకత్వం వహిస్తున్నారు. లీలా గౌతమ్ వర్మ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సైకలాజికల్ థ్రిల్లర్ కథతో తెరకెక్కిన ఈ సినిమా అక్టోబర్ 4న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో చిత్ర విశేషాలను విలేకరులతో పంచుకన్నారు దర్శకుడు శివశేషు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ''.లాక్ డౌన్ టైమ్ లో కలి పేరుతో స్క్రిప్ట్ రెడీ చేశాను. రుద్ర క్రియేషన్స్ బ్యానర్ పై గౌతమ్ వర్మ ప్రొడ్యూస్ చేసేందుకు ముందుకొచ్చారు. అలా మా కలి మూవీ మొదలైంది. అయితే ప్రారంభంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నాం. జగపతి బాబు గారిని ఓ క్యారెక్టర్ కు అనుకున్నాం. అయితే మూవీ ప్రొడక్షన్ కు జగపతి బాబు గారి కాస్టింగ్ సెట్ కాలేదు. దాంతో నరేష్ అగస్త్య కు ఈ కాన్సెప్ట్ చెప్పాను. ఆయనకు బాగా నచ్చి మూవీలో నటించారు.  

జీవితంలో ఎదురయ్యే సమస్యలకు ఆత్మహత్యలు పరిష్కారం కాదు అనే అంశాన్ని మా మూవీలో చెబుతున్నాం. ఓ సర్వే ప్రకారం ప్రపంచంలో 70శాతం మంది ఏదో ఒక సందర్భంలో ఆత్మహత్య ఆలోచన చేస్తున్నారు. కలి చిత్రంలో ప్రిన్స్ చేసిన శివరామ్ క్యారెక్టర్ చాలా మంచి వ్యక్తి. అతని మంచితనం వల్ల ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటాడు. మెత్తగా ఉండేవాడిని సొసైటీ ఆడుకుంటుంది. అలా అతి మంచితనంతో ఉన్న శివరామ్ సమస్యల వల్ల ఆత్మహత్య చేసుకోవాలని అనుకుంటాడు. ఆ సమయంలో అతని ఇంటికి ఓ అపరిచిత వ్యక్తి వస్తాడు. ఈ క్యారెక్టర్ నరేష్ అగస్త్య చేశాడు. అతను వచ్చాక శివరామ్ లైఫ్ లో జరిగిన ఘటనలు ఏంటి అనేది ఈ చిత్ర  కథాంశం. మన పురాణాల్లోని కలి పురుషుడి పాత్రను స్ఫూర్తిగా తీసుకుని కలి మూవీ చేశాను. సమయాన్ని, ఆత్మను ఆధారం చేసుకుని ఈ యుగాన్ని ప్రభావితం చేసే కలిని మా కథలో ఎలా చూపించాం అనేది అక్టోబర్ 4న థియేటర్స్ లో చూడండి'' అన్నారు. 
Siva Sashu
kali

Watch Today's Deals on Amazon

More Press News