చూడకయ్యో నెమలీకళ్ళా పాటను విడుదల చేసిన చంద్రబోస్‌

చూడకయ్యో నెమలీకళ్ళా పాటను విడుదల చేసిన చంద్రబోస్‌
సదన్ హీరోగా,ప్రియాంక ప్రసాద్ హీరోయిన్‌గా రూపొందుతున్న చిత్రం 'ప్రణయగోదారి'.  పి.ఎల్.విఘ్నేష్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని పారమళ్ళ లింగయ్య నిర్మిస్తున్నారు. తాజాగా ఈచిత్రం నుంచి చూడకయ్యో నెమలీకళ్ళాతూగుతున్న తూనిగల్లా అనే పాటను ఆస్కార్‌ అవార్డ్‌ విన్నర్‌ ప్రముఖ లిరిసిస్ట్‌ చంద్రబోస్‌ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పుడే పాట విన్నాను.. చూడకయ్యో నెమలీకళ్ళా తూగుతున్న తూనిగల్లాఅనే పల్లవితో కొనసాగే ఈ పాటలో మంచి సాహిత్యం, సంగీతం వుంది. మార్కండేయిలు ఈ పాటకు చక్కని సాహిత్యంతో పాటు ఆకట్టుకునే స్వరకల్పన చేశాడు.  చక్కటి జానపద సాహిత్యం ఇది. అందరికి చేరువయ్యే తేలికైన మాటలతో.. వినగానే రసానుభూతి కలిగించేలా మంచి సాహిత్యం అందించారు. పాట బాణీతో పాటు నడక, దాని వెనకలా వచ్చే బీట్‌ కూడా నాకు బాగా నచ్చింది.  


గాయనీ సునీత, సాయిచరణ్‌ తన గాత్రంతో పాటకు జీవం పోశారు. నాకు ఈ మధ్య కాలంలో అమితంగా నచ్చిన పేరు 'ప్రణయ గోదారి' టైటిల్‌ చాలా కవితాత్మకంగా వుంది. చిత్రం కూడా అంతే వుంటుందని అనుకుంటున్నాను. తప్పకుండా ఈ పాటతో పాటు చిత్రం కూడా విజయవంతం అవ్వాలని ఆశిస్తున్నాను' అన్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ చిత్రం విడుదల తేదిని త్వరలనే ప్రకటించనున్నారు మేకర్స్‌
Pranayagodari
Chandra bose

More Press News