‘కిలాడీ కుర్రోళ్ళు’ అంటూ రాబోతోన్న కమీడియన్ గౌతం రాజు తనయుడు కృష్ణ

‘కిలాడీ కుర్రోళ్ళు’ అంటూ రాబోతోన్న కమీడియన్ గౌతం రాజు తనయుడు కృష్ణ
టాలీవుడ్‌లో ప్రస్తుతం కొత్త నీరు ప్రవహిస్తోంది. నూతన దర్శకులు, హీరో హీరోయిన్లు టాలీవుడ్‌లో సత్తా చాటుతున్నారు. కంటెంట్ కింగ్ అని ఆడియెన్స్ నమ్ముతున్న, ఆదరిస్తున్న ఈ తరుణంలో యంగ్ జనరేషన్ దుమ్ములేపేస్తోంది. ఈ క్రమంలో సీనియర్ కమీడియన్ గౌతం రాజు తనయుడు కొత్త కథలతో ఆడియెన్స్ ముందుకు రాబోతున్నారు.

గౌతం రాజు తనయుడు కృష్ణ హీరోగా కరోనా టైంలో ఓటీటీలో సందడి చేశారు. కృష్ణారావు సూపర్ మార్కెట్ అంటూ మొదటి చిత్రంతోనే మంచి నటుడిగా క్రేజీ హీరోగా పేరు సంపాదించుకున్నారు. ఇక ఇప్పుడు కృష్ణ వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారని సమాచారం. త్వరలోనే అతడు ‘కిలాడీ కుర్రోళ్ళు’ అనే చిత్రంతో ఆడియెన్స్ ముందుకు రాబోతున్నారు. ఈ మూవీకి సంబంధించిన షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులన్నీ పూర్తయినట్టుగా సమాచారం.

ఇక త్వరలోనే కృష్ణ తన కొత్త చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఇవే కాకుండా కృష్ణ చేతిలో ఇంకో నాలుగైదు చిత్రాలున్నట్టుగా సమాచారం. అంతే కాకుండా ఓ పెద్ద హీరో చిత్రంలో స్పెషల్ రోల్‌ను కూడా చేస్తున్నాడని టాక్.
Kiladi Kurrollu
Gautam Raju
Comedian
Krishna
Tollywood

More Press News