ఆగస్ట్ 9న థియేటర్స్ లో "సంఘర్షణ"

ఆగస్ట్ 9న థియేటర్స్ లో "సంఘర్షణ"
మహీంద్ర పిక్చర్స్ ప్రొడక్షన్ నెంబర్ 1 మూవీ సంఘర్షణ. చిన్న వెంకటేష్ దర్శకత్వంలో వల్లూరి.శ్రీనివాస రావ్ తెలుగు, తమిళ్ భాషల్లో నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమలు పూర్తి చేసుకొని ఆగస్ట్ 9న గ్రాండ్ గా థియేటర్స్ లో విడుదల కానుంది.

ఇదొక సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ అయినా ఇందులో లవ్, ఫ్యామిలీకి సంబందించిన అన్ని రకాల ఎలిమెంట్స్ ఈ చిత్రంలో ఉండబోతున్నాయి. చైతన్య పసుపులేటి, రషీద భాను మెయిన్ లీడ్ గా నటిస్తున్న ఈ సినిమాకు సుధాకర్ అండ్ కేవీ ప్రసాద్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.

వన్ మీడియా ద్వారా పార్థు రెడ్డి సంఘర్షణ సినిమాను థియేట్రికల్ విడుదల చేస్తున్నారు. ఆదిత్య శ్రీ రామ్ ఈ సినిమాకు స్వరాలు సమకూరుస్తున్నారు. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే విధంగా సినిమా ఉంటుందని చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు. ప్రేక్షకులకు నచ్చే సినిమాతో రావడం సంతోషంగా ఉందని నిర్మాత వల్లూరి.శ్రీనివాస్ రావ్ తెలిపారు.

Sangarshana
Chaitanya Pasupuleti
Rasheeda Bhanu
Tollywood

More Press News