ఆదివాసీ మ్యూజియంను సందర్శించిన మంత్రి సత్యవతి రాథోడ్!

Related image

ఆదివాసీ మ్యూజియంను సందర్శించి అక్కడ ఏర్పాటు చేసిన సమ్మక్క - సారలమ్మ వాడిన కత్తులు, వస్తువులు, నాటి దుస్తులు, సంప్రదాయాలు, జీవన విధానాన్ని పరిశీలించిన తెలంగాణ రాష్ట్ర గిరిజన సంక్షేమ, స్త్రీ - శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, ములుగు జడ్పీ చైర్మన్ జగదీశ్, గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్ క్రిస్టినా జెడ్ చోంగ్తు, ఇతర అధికారులు.

అనంతరం జంపన్న వాగు దగ్గర వసతులను పర్యవేక్షించారు. ఆ తరవాత మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు, జడ్పీ చైర్మన్ జగదీశ్, గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్ క్రిస్టినా, సీపీ రవీందర్, కలెక్టర్ కర్ణన్, ఇతర అధికారులు కలిసి మేడారంలో భక్తులకు వసతులు, శాంతి భద్రతలపై సమీక్ష జరిపారు. సమీక్ష అనంతరం మేడారం గద్దెల వద్ద ప్రధాన రహదారిపై దుకాణాల్లో పారిశుద్ధ్యం, ప్లాస్టిక్ నివారణ పై పర్యవేక్షించారు. పరిశుభ్రత పాటించని దుకాణాలు మూసి వేయాలని అధికారులకు ఆదేశించారు. అక్కడి నుంచి నేరుగా సీఎం కేసీఆర్ రేపు మేడారం రానున్న సందర్భంలో సీఎం వసతి, బస, హెలిప్యాడ్ ప్రదేశాలని తనిఖీ చేశారు. హెలికాప్టర్ లో ఎక్కి మేడారంలో భక్తుల సౌకర్యాలు, క్యూ లైన్ లను విహంగ వీక్షణం చేశారు. 

More Press Releases