బరోడా పోలీసు జీతాల ప్యాకేజీ కోసం తెలంగాణ రాష్ట్ర విపత్తు నిర్వహణ, అగ్నిమాపక సేవల శాఖతో బ్యాంక్ ఆఫ్ బరోడా ఒప్పందం

Related image

వేతనాలు పొందే సిబ్బంది,  పెన్షనర్ల కోసం ప్రయోజనాలలో వ్యక్తిగత ప్రమాద బీమా కవరేజీ; యోధా రిటైల్ రుణాలపై ప్రత్యేక ఆఫర్లు ఉన్నాయి

 హైదరాబాదు, June 10, 2024: భారతదేశంలోని ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా పోలీసు వేతన ప్యాకేజీని పొడిగించేందుకు తెలంగాణ రాష్ట్ర విపత్తు నిర్వహణ, అగ్నిమాపక సేవల శాఖతో అవగాహన ఒప్పందం (ఎంఓయూ)పై సంతకాలు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ ఒప్పందంతో తెలంగాణ రాష్ట్ర విపత్తు నిర్వహణ, అగ్నిమాపక సేవల శాఖలో సేవలందిస్తున్న సిబ్బందికి,  పెన్షనర్లకు ప్రత్యేక ఆఫర్లు, ప్రయోజనాలు లభిస్తాయి.  మెరుగైన ఉచిత సమగ్ర వ్యక్తిగత ప్రమాద బీమా కవర్ (పి.ఏ.ఐ.), యోధా రిటైల్ రుణాలపై ప్రత్యేక ఆఫర్లు, డెబిట్,  క్రెడిట్ కార్డ్‌లతో సహా అనేక ఇతర ప్రయోజనాలు  ఈ ఒప్పందంలో భాగంగా అందిస్తారు.

తెలంగాణ రాష్ట్ర విపత్తు నిర్వహణ, అగ్నిమాపక సేవల శాఖ డైరెక్టర్ జనరల్ శ్రీ వై. నాగి రెడ్డి ఐపీఎస్,  బ్యాంక్ ఆఫ్ బరోడా హైదరాబాద్ జోన్ జనరల్ మేనేజర్ &  జోనల్ హెడ్ శ్రీ రితేష్ కుమార్ మధ్య ఈ మేరకు ఎంవోయూ కుదిరింది. బరోడా పోలీసు వేతనాల ప్యాకేజీ తెలంగాణ రాష్ట్ర విపత్తు నివారణ,  అగ్నిమాపక సేవల శాఖ  సిబ్బందికి అనేక ప్రయోజనాలను అందిస్తుంది. విధి నిర్వహణలో ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.1.30 కోట్ల వరకు వ్యక్తిగత ప్రమాద బీమా డెత్ కవరేజీ ,  రూ.1.26 కోట్ల వరకు ఆఫ్ డ్యూటీ ప్రయోజనాలు కలుగుతాయి. శాశ్వత వైకల్యం కవరేజీ రూ.80 లక్షల వరకు లభిస్తుంది. సేవలందిస్తున్న సిబ్బంది అందరికీ అదనంగా రూ. 5 లక్షల వ్యక్తిగత జీవిత బీమా ప్రయోజనాలు కలుగుతాయి.

“మాతో బ్యాంకింగును ఎంచుకున్నందుకు తెలంగాణ రాష్ట్ర విపత్తు నిర్వహణ, అగ్నిమాపక సేవల శాఖకు కృతజ్ఞతలు. ఎం.ఓ.యు. పై సంతకం చేయడం వల్ల రాష్ట్ర ప్రజలకు శ్రద్ధగా సేవ చేస్తున్న ధైర్యవంతులైన వారికి సేవ చేయడానికి,  పూర్తి స్థాయి ఉత్పత్తులు,  సేవలతో వారి బ్యాంకింగ్ అవసరాలను తీర్చడానికి బ్యాంక్ ఆఫ్ బరోడాకు అవకాశం కలుగుతుంది” అని ఈ సందర్భంగా బ్యాంక్ ఆఫ్ బరోడా హైదరాబాద్ జోన్ జనరల్ మేనేజర్,  జోనల్ హెడ్ శ్రీ రితేష్ కుమార్ అన్నారు.

తెలంగాణ రాష్ట్ర అగ్నిమాపక సేవలు, పౌర రక్షణ శిక్షణా సంస్థ సంచాలకులు శ్రీ లక్ష్మీ ప్రసాద్, అగ్నిమాపక సేవల అదనపు సంచాలకులు శ్రీ జి వెంకట నారాయణరావు, తెలంగాణ రాష్ట్ర విపత్తు నిర్వహణ, అగ్నిమాపక సేవల శాఖ ఉప సంచాలకులు శ్రీ సుధాకర్ రావు, ప్రాంతీయ అగ్నిమాపక సేవల అధికారి శ్రీ హరినాథ రెడ్డి,  బ్యాంక్ ఆఫ్ బరోడా హైదరాబాద్ జోన్ బిజినెస్ డెవలప్‌మెంట్ డి. జి. ఎం. శ్రీ MVS సుధాకర్, బ్యాంక్ ఆఫ్ బరోడా హైదరాబాద్ జోన్ ప్రభుత్వ వాణిజ్య ఏ.జి.ఎం. శ్రీ అభిషేక్ భారతి,  బ్యాంక్ ఆఫ్ బరోడా హైదరాబాద్ జోన్ డిఫెన్స్ బ్యాంకింగ్ అడ్వైజర్ బ్రిగేడియర్ ఎస్.కె. ప్రసాద్ (రిటైర్డ్), కూడా ఈ ఒప్పంద కార్యక్రమంలో పాల్గొన్నారు.

 ఇంతే కాకుండా బ్యాంక్ ఆఫ్ బరోడా ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర పోలీసు శాఖతో మరియు తెలంగాణ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఎంఓయూ కుదుర్చుకుంది.

 బ్యాంక్ ఆఫ్ బరోడా గురించి

సర్ మహారాజా సాయాజీరావు గైక్వాడ్ III 1908 జూలై 20 న స్థాపించిన బ్యాంక్ ఆఫ్ బరోడా భారతదేశంలోని ప్రముఖ వాణిజ్య బ్యాంకులలో ఒకటి. 63.97% వాటాతో, ఇది ప్రధానంగా భారత ప్రభుత్వానికి చెందినది. ఐదు ఖండాలలోని 17 దేశాలలో విస్తరించి ఉన్న 70,000కి పైగా టచ్ పాయింట్ల ద్వారా,  అన్ని బ్యాంకింగ్ ఉత్పత్తులు,  సేవలను ఎలాంటి అంతరాయాలు, అవాంతరాలు లేకుండా అందించే వివిధ డిజిటల్ బ్యాంకింగ్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా బ్యాంకు తన గ్లోబల్ కస్టమర్ బేస్ లో ఉన్న 165 మంది మిలియన్ల ఖాతాదారులకు సేవలు అందిస్తుంది. బ్యాంక్  దార్శనికత దాని విభిన్న ఖాతాదారుల ఆకాంక్షలను నెరవేరుస్తుంది. బ్యాంకుతో వారి అన్ని లావాదేవీలలో విశ్వాసం,  భద్రత  భావాన్ని కలిగించడానికి ప్రయత్నిస్తుంది.

More Press Releases