భారతదేశం యొక్క సరికొత్త యానిమే పవర్ హౌస్ గా మారనున్న జియో సినిమా

Related image

~ జనాదరణ పొందిన డెమోన్ స్లేయర్ సీజన్ 4 సిరీస్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా జియో సినిమాలో ప్రసారం కాబోతుంది~

 జాతీయం, మే  2024 – ఈ మధ్యే జియో.. జియో సినిమా ప్రీమియం అనే సరికొత్త ప్లాట్ ఫామ్ ను ప్రారంభించింది. ఈ ప్లాట్ ఫామ్ ప్రారంభించిన దగ్గరనుంచి అభిమానుల ఆదరణ విశేషంగా దక్కుతుంది. ఇప్పుడు మరోసారి జియో సినిమా ప్రీమియం మరింత ఆదరణ పొందేందుకు మే 12 నుంచి ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి పొందిన యానిమే సిరీస్ ను జియో సినిమా ద్వారా అందించనున్నారు. దీనిద్వారా రాబోయే రోజుల్లో మరింత మంది సబ్ స్క్రైబర్లు పెరుగుతారని ఆశిస్తోంది జియో సినిమా. యానిమే సిరీస్ లకు ప్రపంచవ్యాప్తంగా అభిమానలున్నారు.  వారంతా ఇప్పుడు జియో సినిమాకు షిఫ్ట్ అయిన ఈ యానిమే సిరీస్ ను మరింతగా ఆదరిస్తారని భావిస్తున్నారు. అందుకోసమే జియో సినిమాలో అత్యంత ఎక్కువమంది ఎదురుచూస్తున్న యానిమే టైటిల్ గ్లోబల్ సిమ్యుల్‌కాస్ట్ యొక్క డెమోన్ స్లేయర్ సిద్ధంగా ఉంది.

 జియో సినిమా ప్రీమియం సభ్యులు యానిమే హబ్‌కి అన్ లిమిటెడ్ యాక్సెస్‌ను కలిగి ఉంటారు. జియో సినిమా ప్లాన్ నెలకు కేవలం రూ. 29లే.

ఇక యానిమే స్లేట్‌ లో ఉన్న ఎపిసోడ్స్ ని మనం గమనిస్తే... యాక్షన్-ప్యాక్డ్ కామెడీ స్పై X ఫ్యామిలీ మరియు క్లాస్ రూమ్ లో గందరగోళాన్ని సృష్టించే 'అసాసినేషన్ క్లాస్‌రూమ్' ఉన్నాయి. వాటితో పాటు అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసే యాక్షన్-కామెడీ 'మాబ్ సైకో 100' మరియు టైమ్-ట్రావెలింగ్ డ్రామా 'టోక్యో రివెంజర్స్,' ఫాంటసీ అడ్వెంచర్‌ ని అందించే 'డెమాన్ స్కూల్‌కు స్వాగతం పలుకుతారు. ఇరుమ-కున్' మరియు సైకలాజికల్ థ్రిల్లర్ 'వెల్‌కమ్ టు ది ఎలైట్'ను ఆస్వాదిస్తారు. అంతేకాకుండా, ఫాంటసీ ఆధారిత 'దట్ టైమ్ ఐ గాట్ రీఇన్కార్నేటెడ్ యాజ్ ఎ స్లిమ్' మరియు అద్భుతమైన టిక్లింగ్ మిస్టరీ 'ది జుంజీ ఇటో మేనియాక్' వీక్షకులను వారి సీట్ల అంచున ఉంచుతాయి. 


భారతదేశంలో ఒటాకు (యానిమే ఫ్యాన్) కమ్యూనిటీని పెంచే లక్ష్యంతో, ఈ ఆఫర్ లను ప్రకటిస్తున్నారు. దీనిద్వారా ఇప్పటికే హిట్టైనవి మరియు ఇన్నాళ్లు మరుగుల పడిపోయి ఉన్న వజ్రాల్లాంటి సిరీస్ లను ఇప్పుడు జియో సినిమా ద్వారా అభిమానులకు అందించననున్నారు. అన్నీ ఆఫ్‌లైన్ వీక్షణ ఆప్షన్స్ తో యాడ్ ఫ్రీ ఎక్స్ పీరియన్స్ తో అందుబాటులో ఉంటాయి. 'బోఫూరి: ఐ హేట్ గెట్టింగ్ హర్ట్, సో ఐ పుట్ ఆల్ మై స్కిల్ పాయింట్స్ ఇన్‌టు డిఫెన్స్,' డార్క్ కామెడీ 'మై నెక్స్ట్ లైఫ్ ఎ విలయినెస్: ఆల్ రూట్స్ లీడ్ టు డూమ్!, మాయాజాలంతో నడిచే 'ది ఫెమిలియర్ ఆఫ్ జీరో,' గోబ్లిన్-హంటింగ్ యాక్షన్ 'గోబ్లిన్ స్లేయర్,' మరియు 'ఇన్/స్పెక్టర్'తో అతీంద్రియ రహస్యం లాంటి ఎన్నో అద్భుతమైన సిరీస్ లు ప్రతీ ఒక్కరికీ నచ్చేవిధంగా అందుబాటులో ఉన్నాయి. 


యానిమే స్పెషల్ ప్రత్యేక హబ్‌ ను జియో సినిమా ద్వారా పరిచయం చేయడం జియో సినిమా ప్రతినిధి మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ, “జియో సినిమా ప్రీమియం మొదటి లక్ష్యం... వినియోగదారుడే. అతడికి నచ్చిన కంటెంట్ ను అందించాలనే ఉద్దేశంతోనే అధిక-నాణ్యత మరియు విభిన్న కంటెంట్‌కు అత్యధిక ప్రాధాన్యతనిస్తున్నాం. మా లేటెస్ట్ సమర్పణ, యానిమే హబ్.. యానిమే అభిమానులను అలరించే కంటెంట్ ప్రపంచాన్ని అందిస్తుంది. రియల్-టైమ్ గ్లోబల్ రిలీజ్‌ల నుండి వందల గంటల టాప్ యానిమే టైటిల్‌ల వరకు, భారతదేశంలోని యానిమే అభిమానుల కోసం జియో సినిమా యొక్క యానిమే హబ్ గమ్యస్థానంగా మారుతుందని మేము విశ్వసిస్తున్నాము అని అన్నారు.

అంతేకాకుండా యానిమే ఎంటర్‌టైన్‌మెంట్ కోసం ప్రత్యేక హబ్‌తో పాటు, జియో సినిమా ప్రీమియమ్ స్థానిక భాషల్లోని అత్యుత్తమ అంతర్జాతీయ కంటెంట్ ను అందిస్తుంది. మరోవైపు పిల్లలు & కుటుంబాన్ని కూడా అలరించే  వినోదాన్ని అందించేందుకు సదా సిద్ధంగా ఉంది. బ్లాక్‌బస్టర్ మూవీస్ మరియు ప్రత్యేక టీవీ ప్రీమియర్‌లు మరియు లైవ్ ఛానెల్‌లలో అనేక రకాల యాక్సెస్‌ను అన్‌లాక్ చేస్తుంది. 4K నాణ్యతతో కూడా ప్రసారాలు అన్నీ నెలకు కేవలం రూ.29లకే లేదా గరిష్టంగా 4 స్క్రీన్‌లకు నెలకు రూ.89 మాత్రమే. 

More Press Releases