కోట్ల రూపాయలతో ఖమ్మం నగర అభివృద్ధి పనులను చేపట్టాం: మంత్రి పువ్వాడ

Related image

ఖమ్మం నగరాభివృద్దిలో భాగంగా వివిధ డివిజన్ పరిధిలో మంజూరు చేసిన సీసీ రోడ్లు, సైడ్ కాల్వల నిర్మాణ పనులకు తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ శంకుస్థాపన చేశారు. మంగళవారం ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో మంత్రి విస్తృతంగా పర్యటించారు. నగరంలోని20, 26, 33, 34, 37, 38, 39, 48వ డివిజన్లలో రూ.1.85 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. వివిధ డివిజన్లలో తిరిగి పెండింగ్ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఖమ్మం నగరంలో కోట్ల రూపాయలతో అనేక అభివృద్ధి పనులు చెప్పటినట్లు తెలిపారు. ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో అన్ని ప్రధాన రదారులు ఇప్పటికే విస్తరించి డివైడర్ తో పాటు సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయడమైనదన్నారు. ఇంకా మరిన్ని రోడ్లు చేయాల్సి ఉందన్నారు. అంతర్గత రోడ్లు, సీసీ డ్రైన్లు మంజూరు చేసి వేసామన్నారు. ఇంత వరకు ఎన్నడూ లేని విధిగా ఖమ్మం నగరాన్ని సుందరికరించమని, అందుకు తెరాస ప్రభుత్వం కోట్ల రూపాయలు నిధులు కేటాయించిందన్నారు. గత ఖమ్మంను ఇప్పుడు పోల్చి చూస్తే 200 రేట్లు అభివృద్ధి చెందిందన్నారు. త్రాగునీటి సమస్యను అధిగమించి సుందర ఖమ్మంగా తీర్చిదిద్దిన విషయం గుర్తు చేశారు. నగరంలో కొనసాగుతున్న పనులు నెలాఖరులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో మేయర్ పాపాలాల్, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, మున్సిపల్ కమీషనర్ అనురాగ్ జయంతి IAS, మాజీ AMC చైర్మన్ RJC కృష్ణ, కార్పొరేటర్లు కమర్తపు మురళి, పగడాల నాగరాజు, దొరిపల్లి శ్వేత, శీలంశెట్టి రమ, దాదే ధనలక్ష్మి, పాలడుగు పాపారావు, రుడావత్ రమాదేవి, తోట రామారావు, బాలగంగాధర్ తిలక్, మున్సిపల్ ME, DEలు, AEలు తదితరులు ఉన్నారు.

More Press Releases