ఎండ తీవ్రత నేపథ్యంలో యాదాద్రిలో భక్తులకు సౌకర్యాల కల్పన

Related image

హైదరాబాద్, ఏప్రిల్ 4 :: రాష్ట్రాల్లో పది, ఇంటర్ పరీక్షలు పూర్తయి పాఠశాలు, కళాశాలలకు సెలవులు ప్రకటించిన దృష్ట్యా రాష్ట్రంలోని పలు దేవాలయాలను సందర్శించే భక్తుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఈ నేపథ్యంలో అన్ని దేవాలయాల్లో భక్తులకు మెరుగైన మౌలిక సదుపాయాలను కల్పించాలని దేవాదాయ ధర్మాదాయ కమీషనర్ హనుమంత రావు ఆదేశించడంతో అన్ని ప్రధాన దేవాలయాల్లో భక్తులు ఎండబారిన పడకుండా షామియానాలు, ఆలయ ప్రాంగణంలో పలు చోట్ల తాగునీటి సౌకర్యాలు, చిన్న పిల్లలకు పాలిచ్చే లాక్టేషన్ గదులు, వృద్దులు, వికలాంగులకు వీల్ ఛైర్లు, క్యూ కాంప్లెక్స్ ల వద్ద షెడ్ తదితర ఏర్పాట్లను చేపట్టాయి. దీనిలో భాగంగా, రాష్ట్రంలోనే ప్రధాన ఆలయమైన యాదగిరి శ్రీ లక్ష్మి నర్సింహా స్వామి ఆలయంలో భక్తులకు విస్తృత ఏర్పాట్లను కల్పించారు. భక్తులు ఎండకు ఎండకుండా, కాళ్ళు కాలకుండా, వానకు తడవకుండా ఉండేందుకు గుట్ట పైన ప్రధాన ఆలయంలో ఆధునిక జర్మన్ హాంగర్ షెడ్ ను ఏర్పాటు చేశారు.


 ఉత్తర మాడ వీధిలో 23000 చ.అ. విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ హాంగర్ షెడ్ వల్ల స్వామి వారి దర్శనానంతరం భక్తులు సేద తీరడానికి సౌకర్యం ఏర్పడింది. అదేవిధంగా, క్యూ లైన్లలో బాలింతలు తమ పిల్లలకు పాలిచ్చేందుకు వీలుగా ప్రత్యేకంగా లాక్టేషన్ గదులను ఏర్పాటు చేశారు. వేసవి సందర్బంగా దాహార్థి తీర్చేందుకు జర్మన్ హాంగర్ సమీపంలోనూ, క్యూ లైన్ల వద్ద మంచినీటి నల్లాలను ఏర్పాటు చేయడంతో పాటు, భక్తులు కూర్చోవడానికి ప్రత్యేకంగా సీటింగ్ సదుపాయం ఏర్పాటు చేశారు. భక్తుల రద్దేని దృష్టిలో ఉంచుకొని క్యూ కాంప్లెక్స్ వద్ద ఏసీ సామర్ధ్యాన్ని పెంచడం జరిగింది. వృద్దులు, దివ్యాంగుల సౌకర్యార్థం ప్రోటోకాల్ విభాగం వద్ద వీల్ చైర్ల సదుపాయం కల్పించారు. దైవ దర్శనానికి వెళ్లే భక్తులకు టికెట్ కౌంటర్ నుండి క్యూ కాంప్లెక్స్ వరకు షెడ్ లను ఏర్పాటు చేయడం జరిగింది. సామాన్య భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన ఈ వసతుల పట్ల భక్తులు హర్షామోదాలు వ్యక్తం చేస్తున్నారు.

       

More Press Releases