కొత్త బ్రాండ్ ప్రచారం హమేషా #రెడీ టు పెరఫార్మ్ (# ReadyToPerform) ను క్రికెట్ ఐకాన్ & బ్రాండ్ అంబాసిడర్ విరాట్ కోహ్లీ తో ప్రారంభించిన 'అమేజ్'

Related image

సౌర ఆధారిత ఉత్పత్తులతో సహా ఎనర్జీ సొల్యూషన్స్ యొక్క విస్తృత శ్రేణిని ప్రదర్శిస్తుంది

Ø    లుమినస్ పవర్ టెక్నాలజీస్ బ్రాండ్, అమేజ్,  సోలార్ ప్రొడక్ట్ సొల్యూషన్స్ మరియు హై కెపాసిటీ ఇన్వర్టర్‌లపై దృష్టి సారించి రాబోయే 3 సంవత్సరాలలో తమ వృద్ధిని మరియు వినియోగదారుల టచ్‌పాయింట్‌లను మూడు రెట్లు పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది.

Ø    తన కొత్త హమేషా #రెడీ టు పెరఫార్మ్  ప్రచారాన్ని ప్రారంభించింది, ఇందులో క్రికెట్ ఐకాన్ మరియు బ్రాండ్ అంబాసిడర్ విరాట్ కోహ్లీ శక్తి రంగంలో పనితీరును పునర్నిర్వచించే బ్రాండ్ విలువ ప్రతిపాదనను వెల్లడిస్తారు .

Ø    నివాస మరియు వాణిజ్య రంగంపై దృష్టి సారించిన  తమ నూతన , అత్యుత్తమ శ్రేణి ఇన్వర్టర్లు, బ్యాటరీలు మరియు సౌర పరిష్కారాలను ప్రదర్శిస్తుంది


లక్నో, 3 ఏప్రిల్ 2024: భారతదేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఎనర్జీ సొల్యూషన్స్ బ్రాండ్,  అమేజ్, తమ సరికొత్త బ్రాండ్ క్యాంపెయిన్ హమేషా #రెడీ టు పెరఫార్మ్ ను ప్రారంభించింది. ఈరోజు లక్నోలో జరిగిన ఒక కార్యక్రమం లో తమ  విస్తృత శ్రేణి ఇన్వర్టర్లు, బ్యాటరీలు మరియు సోలార్ ఉత్పత్తులను ప్రదర్శించింది. వినియోగదారులు  తమ కలలను సాకారం చేసుకోవడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండేలా ప్రేరేపిస్తూ, అత్యుత్తమ శక్తి పరిష్కారాలను అందించడంలో అమేజ్ యొక్క నిబద్ధతను ఈ ఆవిష్కరణ  సూచిస్తుంది.  సుదీర్ఘమైన మరియు తరచుగా ఎదురయ్యే  విద్యుత్ కోతలు, విపరీతమైన వాతావరణ పరిస్థితులను ఎదుర్కొనేలా మరియు వేగవంతమైన ఛార్జింగ్ ఫీచర్‌ను కలిగి ఉన్న  విస్తృతమైన ఉత్పత్తి శ్రేణిని ఇది అందిస్తుంది.


కొత్త హమేషా #రెడీ టు పెరఫార్మ్ ప్రచారంలో భాగంగా, అమేజ్ తమ  మొట్టమొదటి బ్రాండ్ నేపథ్య మరియు ఉత్పత్తి చలనచిత్రాన్ని ఆవిష్కరించింది, ఇది వినియోగదారులను వారి సరిహద్దులను అధిగమించడానికి, సవాళ్లను ఎదుర్కోవటానికి  మరియు శ్రేష్ఠత కోసం నిరంతరం కృషి చేయడానికి ప్రేరేపించడం లక్ష్యంగా పెట్టుకుంది. క్రికెట్ మైదానంలో అసమానమైన అంకితభావం మరియు స్థిరత్వానికి ప్రసిద్ధి చెందిన విరాట్ కోహ్లి, సంసిద్ధత మరియు అత్యుత్తమ ప్రదర్శన యొక్క స్ఫూర్తిని ప్రతిబింబిస్తాడు. ఈ చిత్రం,  ప్రతి రోజు విరాట్  , తన  ఆటలోని ప్రతి అంశంలో మెరుగైన ప్రదర్శన చేయడానికి తన పరిమితులను పెంచడాన్ని ప్రదర్శిస్తుంది.  ఫలితంగా వేగంగా స్కోరింగ్  చేయటం మరియు ఓర్పు  అతని ఆటలో కనిపిస్తుంది . నిరంతర విద్యుత్ సరఫరాతో అభివృద్ధి చెందుతున్న భారతదేశం యొక్క కలలు మరియు ఆకాంక్షలను శక్తివంతం చేయడం, అత్యుత్తమ ఇంధన పరిష్కారాలను అందించడంలో అమేజ్ యొక్క నిరంతర  ఆవిష్కరణ మరియు నాణ్యతను ఈ ప్రచారం నొక్కి చెబుతుంది.


ఈ సందర్భంగా సిఇఒ మరియు ఎండి ప్రీతి బజాజ్ మాట్లాడుతూ, “అధిక-నాణ్యత మరియు శక్తి-సమర్థవంతమైన ఇంధన పరిష్కారాలను అందించడం ద్వారా భారతదేశంలో నమ్మదగిన బ్రాండ్‌గా అమేజ్  స్థిరపడింది. పెరుగుతున్న పట్టణీకరణ మరియు వినియోగదారుల కొనుగోలు శక్తి పెరుగుదల కారణంగా రిటైల్ మరియు ఇంధన రంగాలు ప్రస్తుతం నూతన , అభివృద్ధి చెందుతున్న భారత్‌లో సరికొత్త  తరహా వృద్ధిని సాధిస్తున్నాయి . సోలార్ విధానంతో పాటుగా ఆవిష్కరణ మరియు విస్తరణపై వ్యూహాత్మక దృష్టితో, భారతదేశంలోని ఇంధన రంగం పై అమేజ్ గణనీయమైన ప్రభావాన్ని చూపడానికి సిద్ధంగా ఉంది మరియు రాబోయే 3 సంవత్సరాలలో మా వృద్ధి మరియు కస్టమర్ టచ్‌పాయింట్‌లను మూడు రెట్లు పెంచడం మా లక్ష్యం. నిరంతర విద్యుత్ సరఫరాతో అభివృద్ధి చెందుతున్న భారతదేశం యొక్క కలలు మరియు ఆకాంక్షలకు శక్తినివ్వడం కొనసాగించాలని మేము భావిస్తున్నాము..." అని అన్నారు. 


నీలిమ బుర్రా, చీఫ్ స్ట్రాటజీ, ట్రాన్స్‌ఫర్మేషన్ & మార్కెటింగ్ ఆఫీసర్ జోడిస్తూ , “ హమేషా #రెడీ టు పెరఫార్మ్ ప్రచారం ,  వినియోగదారులను తమ జీవితంలోని ప్రతి అంశంలో రాణించేలా చేయడంలో అమేజ్ యొక్క నిబద్ధతను వివరిస్తుంది. కరెంటు కోతల సమస్య లేకుండా సరిహద్దులను ఛేదించడానికి మరియు కలలను వెంబడించడానికి మధ్య తరగతి  భారతదేశాన్ని ప్రేరేపించేలా  వినియోగదారుల అభిప్రాయాల  ఆధారంగా ఈ చిత్రం రూపొందించబడింది.


వేగంగా మారుతున్న ప్రపంచంలో వారు వెనుకబడి ఉండకూడదనుకోవడం మరియు విశ్రాంతి లేకుండా వారు  రోజువారీ సవాళ్లకు తమను తాము సిద్ధం చేసుకోవడం వల్ల మధ్య తరగతి  భారతదేశం వృద్ధి చెందుతోందని మేము నమ్ముతున్నాము.


“ఈ చిత్రం భారతదేశానికి తెలిసిన మరియు ఎదురుచూసే నిజమైన ప్రదర్శనకారుడిగా  విరాట్ కోహ్లితో సమానంగా  మరో అసలైన పెరఫార్మర్ గా  అమేజ్‌ను హైలైట్ చేస్తుంది.  భారతదేశంలోని అభివృద్ధి చెందుతున్న నగరాలు మరియు పట్టణాలలో వినియోగదారుల అవసరాలను తీర్చడానికి అమేజ్ వద్ద మేము కట్టుబడి ఉన్నాము. ఈ ఆశావహ వ్యక్తులు తమ కలలను సాకారం చేసుకోవడంలో మరియు విజయాన్ని సాధించడంలో సహాయం చేయడాన్ని   మేము లక్ష్యంగా చేసుకున్నాము . అయినప్పటికీ, తరచుగా విద్యుత్ కోతలు వారి  పురోగతికి గణనీయమైన సవాలుగా మారాయి. అందుకే విజయం వైపు వారి ప్రయాణంలో అమేజ్ వారికి అత్యంత విశ్వసనీయమైన మరియు నమ్మదగిన భాగస్వామి అని మేము నమ్ముతున్నాము..." అని అన్నారు. 


గ్రే గ్రూప్ ఇండియా చైర్‌పర్సన్ మరియు గ్రూప్ సీఈఓ అనూషా శెట్టి మాట్లాడుతూ, "దేశాన్ని తీర్చిదిద్దుతోన్న  కొత్త తరంగం, డిజిటల్ ప్రజాస్వామ్యానికి ధన్యవాదాలు.  సాధ్యం కానిది ఏదీ లేదని భారతీయులు నమ్ముతున్నారు. మీరు ఎక్కడి నుండి వచ్చారో కాదు, మీరు ఎక్కడికి చేరుకుంటున్నారో చూసే భారతీయులు పెరుగుతున్నారు. ఈ తరహా ఆలోచనలు కలిగిన  భారతీయులకు  నిరంతర శక్తితో వారి ఆకాంక్షలకు తోడ్పడటాన్ని అమేజ్ విశ్వసిస్తుంది" అని అన్నారు. 


అమేజ్ యొక్క ఇన్వర్టర్ బ్యాటరీల విశ్వసనీయత మరియు సామర్థ్యాన్ని హైలైట్ చేస్తూ, సంసిద్ధత మరియు పనితీరు పట్ల విరాట్ కోహ్లి నిబద్ధతను ప్రదర్శించే ఆకర్షణీయమైన విజువల్స్ మరియు వీడియోలు ఈ ప్రచారంలో ఉంటాయి. వివిధ డిజిటల్ మరియు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా, వినియోగదారులను అమేజ్  చేరుకుంటుంది,  #రెడీ టు పెరఫార్మ్ అనే హ్యాష్‌ట్యాగ్‌ని ఉపయోగించి వారి సంసిద్ధత మరియు పనితీరు గురించిన కథనాలను పంచుకునేలా వారిని ప్రోత్సహిస్తుంది.


అమేజ్ యొక్క ఉత్పత్తి శ్రేణి అత్యాధునిక సాంకేతికత, అత్యుత్తమ పనితీరు మరియు వినియోగదారు-కేంద్రీకృత డిజైన్‌ను మిళితం చేసి వినియోగదారులకు సాటిలేని విలువను అందిస్తుంది. బ్లాక్‌అవుట్‌ల సమయంలో నిరంతరాయంగా విద్యుత్ సరఫరాను అందించడం, సౌరశక్తితో శక్తి సామర్థ్యాన్ని పెంచడం లేదా విద్యుత్ హెచ్చుతగ్గుల నుండి కీలకమైన పరికరాలను రక్షించడం వంటివి చేసినా, అమేజ్ యొక్క కొత్త ఉత్పత్తులు ఎల్లప్పుడూ కనెక్ట్‌డ్ గా  మరియు ఉత్పాదకంగా ఉండేలా  వినియోగదారులను శక్తివంతం చేయడానికి రూపొందించబడ్డాయి.

More Press Releases