బీరంగూడా , హైదరాబాద్‌ వద్ద తమ అత్యాధునిక మ్యూజిక్‌ అకాడమీని ప్రారంభించిన ముజిగల్‌

Related image

   వ్యవస్థీకృత సంగీత పరిశ్రమలో సుప్రసిద్ధ సంస్థగా తమను తాము నిలుపుకునేందుకు ప్రయత్నాలను కొనసాగిస్తున్న ముజిగల్‌, తమ కార్యకలాపాలను మరింతగా విస్తరించడంతో పాటుగా గణనీయమైన  ప్రభావాన్ని చూపుతుంది

·       ఇది హైదరాబాద్ నగరంలో 8వ ముజిగల్ అకాడమీ

హైదరాబాద్‌, 31 మార్చి  2023 : భారతదేశపు అతిపెద్ద మ్యూజిక్‌ ఎడ్యుకేషన్‌ ప్లాట్‌ఫామ్‌, ముజిగల్‌ తమ 8వ అత్యాధునిక సంగీత అకాడమీని  హైదరాబాద్‌లోని బీరంగూడా లో ప్రారంభించింది. బీరంగూడా (హైదరాబాద్‌)లో ఉన్న అకాడమీ 1500 చ.అ విస్తీర్ణం లో  సాటిలేని సౌకర్యాలు కలిగి ఉంది. ఇది గాత్రం మరియు వాయిద్యంతో సహా సంగీతం నేర్చుకోవడానికి అత్యంత అనుకూలమైనది. ముఖ్య అతిథి  శ్రీమతి అనన్య భాస్కర్ (భారతీయ నేపథ్య గాయని), గౌరవ అతిధులు - కాటా శ్రీనివాస్ గౌడ్ (పటాన్ చెరు  నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి) & డా. లక్ష్మీనారాయణ ఏలూరి (వ్యవస్థాపకుడు-ముజిగల్) సమక్షంలో  దీనిని ప్రారంభించారు.

దాదాపు 500 మంది విద్యార్థులకు పలు బ్యాచ్‌లుగా బోధన చేసే సౌకర్యాలు కలిగిన బీరంగూడా లోని  ఈ  మ్యూజిక్‌ అకాడమీలో  పియానో, కీబోర్డ్‌, గిటార్‌, డ్రమ్స్‌, కర్నాటిక్‌ వోకల్స్‌, హిందుస్తానీ వోకల్స్‌ ,  వెస్ట్రన్‌ వోకల్స్‌ లో బోధన చేస్తారు. ఈ మ్యూజిక్‌ అకాడమీ ప్రారంభం తరువాత, తొలి నెలరోజులూ ఉచితంగా సంగీత విద్యను చేరిన ప్రతి ఒక్కరికీ అందిస్తారు. ఆ తరువాత చేరిన ప్రతి ఒక్కరికీ ఒక నెల పూర్తి ఉచిత సంగీత విద్యను అందించనున్నారు.

సంగీత అభ్యాసంలో సమగ్రమైన కార్యాచరణ  అందించడం ద్వారా మరియు ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ రూపాలలో  బోధనతో   సంగీత విద్యలో అత్యున్నత ప్రమాణాలను ముజిగల్‌ యొక్క అత్యాధునిక అకాడమీ  ఏర్పరిచింది. ఇదే కేంద్రంలో సంగీత  పరికరాలను సైతం విక్రయాలకు అందుబాటులో ఉంచారు.

బీరంగూడా లో  ముజిగల్‌ అకాడమీ ప్రారంభం గురించి ముజిగల్‌ ఫౌండర్‌ డాక్టర్‌ లక్ష్మీనారాయణ ఏలూరి మాట్లాడుతూ ‘‘ సంగీత విద్యను అందరికీ చేరువ చేయాలనే మహోన్నత లక్ష్యంతో ముజిగల్‌ అకాడమీ తీర్చిదిద్దాము. అభ్యాసకులకు అత్యాధునిక సౌకర్యాలతో కూడిన కేంద్రాన్ని  తమకు దగ్గరలో అందిస్తుంది. సంగీతంలో అత్యుత్తమ అభ్యాసం మరియు బోధన అనుభవాలను ఈ కేంద్రం అందించనుంది. భారతీయ శాస్త్రీయ మరియు పాశ్చాత్య సంగీతంలో విస్తృత శ్రేణి కోర్సులను ఇది అందిస్తుంది. ఈ కోర్సులను నిష్ణాతులైన సంగీత అధ్యాపకులు బోధించనున్నారు. వీటితో పాటుగా,  అభ్యాసకులను లక్ష్యంగా చేసుకుని ఓ నిర్మాణాత్మక కరిక్యులమ్‌ (బోధనాంశాలు), పీరియాడిక్‌ ఎస్సెస్‌మెంట్స్‌, సర్టిఫికేషన్‌, సౌకర్యవంతమైన ఫీజు చెల్లింపు ప్లాన్స్‌, సుశిక్షితులైన  అధ్యాపకులను అందుబాటులో ఉంచాము’’ అని అన్నారు.

భారతదేశంతో పాటుగా యుఎస్‌ఏ, యుకె, ఆస్ట్రేలియా, యుఏఈలలో 10వేల మంది విద్యార్ధులకు 400కు పైగా సుశిక్షితులైన సంగీత టీచర్లు మద్దతు అందిస్తున్నారు. ఇప్పటికే 40వేల తరగతులు విజయవంతంగా పూర్తయ్యాయి. ముజిగల్‌, అంతర్జాతీయంగా సంగీతాభిమానులైన  అంటే వారు హాబీగా సంగీతం నేర్చుకుంటున్నా  లేదా ట్రినిటీ గ్రేడ్‌ సర్టిఫికేషన్‌ కోసం తీవ్రంగా శ్రమించే వారైనా , విద్యార్థుల కోరికలను తీరుస్తుంది. 

భారతదేశంలో సంప్రదాయ సంగీత ఇనిస్టిట్యూషన్స్‌ అత్యధిక శాతం మామ్‌–అండ్‌  – పాప్‌ షాప్స్‌,  హోమ్‌ ట్యూషన్స్‌ లేదా  భారీ బొటిక్‌ ఇనిస్టిట్యూషన్స్‌గా ఉంటున్నాయి. ఇవి కొన్ని ప్రాంతాలకు పరిమితం కావడం లేదా  అనుభవజ్ఞులైన సంగీత అభ్యాసకులకు పరిమితమై ఉంటాయి. ముజిగల్‌ అకాడమీ అత్యాధునిక మౌలిక సదుపాయాలు, విస్తృత శ్రేణిలో సంగీత కోర్సులు, అంకితం చేయబడిన సిబ్బంది, సుశిక్షితులైన  టీచర్లు మరియు షాప్‌ –ఫ్రంట్‌ తో చుట్టుపక్కల సంగీత అకాడమీలను సంపూర్ణం చేయడం మరియు పునర్నిర్మించడం చేస్తుంది. అన్ని వయసులు, వర్గాల  అభ్యాసకులను ముజిగల్‌ ఆహ్వానిస్తోంది.

సంగీత అభ్యాసకుల అవసరాలను తీర్చడానికి ముజిగల్‌ తన ఆన్‌లైన్‌ ఉనికి, ఆఫ్‌లైన్‌ అకాడమీ మరియు నిపుణులైన  బోధకులపై ఆధారపడి  సంగీత విద్యలో సమగ్రమైన విధానాన్ని అందిస్తుంది. ఈ విధానం, విద్యార్థులు వారి సంగీత ఆకాంక్షలను సాధించడానికి అవసరమైన వనరులు మరియు మార్గదర్శకాలను కలిగి ఉండేలా నిర్ధారిస్తుంది.

బీరంగూడ ముజిగల్ అకాడమీ ప్లాట్ నెం .8, అమీన్‌పూర్ పోలీస్ స్టేషన్ ఆర్చ్ ఎదురుగా, మధురా నగర్ కాలనీ, బీరంగూడ, సంగారెడ్డి, తెలంగాణ 502032 వద్ద ఉంది.
   

More Press Releases