దేశవ్యాప్తంగా యువ భారతీయ కొనుగోలుదారులు ఆడి లగ్జరీ కార్లను ఎంచుకుంటున్నారు

Related image

ఆడి ఇండియా గమనించిన విశేషమైన ట్రెండ్‌లో, దేశవ్యాప్తంగా యువ కొనుగోలుదారులు ఆడి లగ్జరీ కార్లను ఎంచుకుంటున్నారు. కొత్త ఆడి కస్టమర్లలో 58% మంది 50 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు గలవారు. అత్యాధునిక సాంకేతికత పట్ల వివేచనాత్మక అభిరుచికి, ప్రశంసలకు పేరుగాంచిన యువ జనాభా ఆడి ప్రీమియం ఆఫర్‌లను ఎక్కువగా ఎంచుకుంటున్నారు. ఈ మార్పు అనేది కొత్త తరం లగ్జరీ కార్ ఔత్సాహికు లకు బ్రాండ్ యొక్క విజయవంతమైన అప్పీల్‌ని సూచిస్తుంది. వారు పనితీరు, స్టైల్, వినూత్నతల తిరుగు లేని మిశ్రమాన్ని కోరుకుంటున్నారు. అంతేగాకుండా, లగ్జరీ కార్ కొనుగోలుదారులు సంప్రదాయ సెడాన్‌ల కంటే ఎస్ యూవీల కోసం గుర్తించదగిన ప్రాధాన్యం ఇస్తున్నారు.

 బ్రాండ్ తన ఎస్ యూవీ పోర్ట్‌ ఫోలియోకు సంబంధించి 174% అమ్మకాల పెరుగుద లను గమనించింది. ఇది వినియోగదారుల ప్రాధాన్యతలలో మార్పును చాటిచెబుతుంది. వాహన పరిశ్రమలో విస్తృత ధోరణిని ప్రతిబింబిస్తుంది. విశాలమైన ఇంటీరియర్స్, ఎలివేటెడ్ డ్రైవింగ్ పొజిషన్‌లు, అధునాతన సేఫ్టీ ఫీచర్ల ఆకర్షణ ఎస్ యూవీలను విలాసవంతమైన కార్ల ఎంపికలలో ముందంజలో ఉంచింది. అసమానమైన డ్రైవింగ్ అనుభవాలను అందించడంలో నిబద్ధతకు ప్రసిద్ధి చెందిన ఆడి ఇండియా, భారతీయ లగ్జరీ కార్ మార్కెట్‌లో అభివృద్ధి చెందుతున్న డిమాండ్‌లను తీర్చడానికి వ్యూహాత్మకంగా పని చేస్తోంది. ఆడి క్యూ శ్రేణితో సహా బ్రాండ్ యొక్క విభిన్నమైన ఎస్ యూవీల పోర్ట్‌ ఫోలియో వివేకవంతులైన కొనుగోలుదారులతో అనూహ్యంగా బాగా పుంజుకుంది. ఆడి లగ్జరీ ఆటోమోటివ్ విభాగంలో ప్రమాణాలను నిర్దేశించడాన్ని కొనసాగిస్తున్నందున, ఈ ట్రెండ్‌లు భార తీయ వినియోగదారుల డైనమిక్ ప్రాధాన్యతలను తీర్చగల బ్రాండ్ సామర్థ్యాన్ని నొక్కి చెబుతున్నాయి.

 యువ కొనుగోలుదారుల పెరుగుదల, లగ్జరీ కార్ మార్కెట్‌లో ఎస్ యూవీల ఆధిపత్యం అనేది ఆధునిక భారతీయ వినియోగదారుల ఊహలను ఆకర్షించే అధునాతనమైన, అధిక-పనితీరు గల వాహనాలను అందించడంలో ఆడి అగ్రగామి స్థానాన్ని మరింత పటిష్టం చేసింది.

More Press Releases