ఆంధ్రప్రదేశ్‌లో తమ వృద్ధిని కొనసాగిస్తోన్న టీవీఎస్ ఐక్యూబ్ (TVS iQube)

Related image

నూతన కస్టమర్‌లు TVS iQube మరియు TVS iQube S కొనుగోలుపై రూ. 22,065 వరకు FAME II సబ్సిడీని పొందవచ్చు.


 మార్చి 13, 2024:  ద్వి మరియు మూడు చక్రాల  విభాగంలో ప్రపంచ వ్యాప్తంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న సుప్రసిద్ధ  గ్లోబల్ ఆటోమేకర్ టీవీఎస్ మోటర్ కంపెనీ , ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా తమ టీవీఎస్ ఐక్యూబ్ సిరీస్ లో 10,000 యూనిట్లకు పైగా అమ్మకాల మైలురాయిని సాధించిందని  ప్రకటించింది. భారతదేశం అంతటా 2.5 లక్షలకు పైగా TVS iQube యూనిట్లు విక్రయించబడడంతో, ఎలక్ట్రిక్ మొబిలిటీ దిశగా ప్రయాణం ఎలాంటి తప్పు లేకుండా ముందుకు సాగుతుంది.


ఈ విద్యుత్ విప్లవాన్ని మరింత ముందుకు తీసుకువెళుతూ, TVS మోటర్ కంపెనీ FAME II సబ్సిడీతో పాటు, కస్టమర్లు ఇప్పుడు TVS iQube ఎలక్ట్రిక్ స్కూటర్ల కొనుగోలుపై రూ. 10,199 వరకు ప్రయోజన పథకాన్ని కూడా పొందవచ్చని ప్రకటించింది. దీనితో ఆంధ్రప్రదేశ్‌లోని కీలక నగరాల్లో  TVS iQube శ్రేణి స్కూటర్ల ప్రారంభ ధర రూ. 135,105 గా ఉంటుంది. 


 పట్టణ ప్రయాణికుల కోసం రూపొందించిన అధునాతన ఫీచర్లతో TVS iQube ప్రత్యేకంగా నిలుస్తుంది. శక్తివంతమైన  3.4 kWh బ్యాటరీ ని కలిగిన  TVS iQube 100 కిలోమీటర్ల వాస్తవ పరిధిని కలిగి ఉండటం తో పాటుగా  సౌకర్యవంతమైన మరియు నమ్మదగిన ప్రయాణ అనుభవాన్ని నిర్ధారిస్తుంది. దీని విశాలమైన 31-లీటర్ అండర్ సీట్ స్టోరేజ్ అవసరమైన వస్తువులను నిల్వ చేయడానికి తగినంత స్థలాన్ని అందిస్తుంది, అలాగే  పెద్ద ఫుట్‌బోర్డ్ మరియు విశాలమైన సీటు వంటి ఆచరణాత్మక లక్షణాలు సవారీ చేయడానికి సులభమైన స్కూటర్‌గా దీనిని నిలుపుతాయి.


అదనంగా, వినియోగదారులు  కిలోమీటరుకు 30 పైసల అతి తక్కువ రన్నింగ్ ధర కారణంగా, మూడేళ్లలో రూ. 1.2 లక్షల రూపాయలు వరకు ఆదా చేయవచ్చు.   7” TFT స్క్రీన్ మరియు క్లీన్ UI, వాయిస్ అసిస్ట్ మరియు TVS iQube Alexa స్కిల్‌సెట్, సహజమైన మ్యూజిక్ ప్లేయర్ కంట్రోల్, OTA అప్‌డేట్‌లు, ఛార్జర్‌తో పాటు ప్లగ్-అండ్-ప్లే క్యారీతో ఫాస్ట్ ఛార్జింగ్, రివర్స్ పార్కింగ్ సహాయం, వాహన ట్రాకింగ్, వాహన ఆరోగ్యం మరియు భద్రతా నోటిఫికేషన్‌లతో సహా 118కి పైగా కనెక్ట్ చేయబడిన ఫీచర్‌లతో TVS iQube స్మార్ట్ మరియు సహజమైన పట్టణ ప్రయాణం కోసం కొత్త ప్రమాణాన్ని నిర్దేశిస్తుంది.


రెండున్నర లక్షల మంది కస్టమర్లు TVS iQube ఎలక్ట్రిక్‌ని స్వీకరించారు, ఇది EVల వైపు జాతీయ మార్పును ప్రతిబింబిస్తుంది. ఈ ఉత్తేజకరమైన EV ప్రయాణంలో, TVS మోటర్ కంపెనీ మూడు ప్రాథమిక సూత్రాల ద్వారా ప్రేరణ పొందింది: వినియోగదారులకు శ్రేణి, కనెక్ట్ చేయబడిన సామర్థ్యాలు మరియు రంగుల కోసం ఎంపిక యొక్క శక్తిని అందించడం; తాజా నిబంధనలకు కట్టుబడి ఉండటం తో వాహన భద్రత మరియు డెలివరీ వాగ్దానానికి దారితీసే మొత్తం కొనుగోలు అనుభవంకు సంబంధించి పూర్తి మనశ్శాంతిని అందించటం   మరియు  ప్రభావవంతంగా ఉన్నప్పటికీ సౌకర్యవంతముగా ఉండటం ద్వారా TVS iQubeని నిర్వహించడంలో సరళతతో ఉండేలా చేయటం.   ప్రస్తుతం, ఈ స్కూటర్ భారతదేశంలోని 348 నగరాలు మరియు 612 డీలర్‌షిప్‌లలో అందుబాటులో ఉంది.

More Press Releases