ఫలక్ నుమా సమీపంలోని ఫరూక్ నగర్ బస్ డిపో వద్ద పాత బస్తీ మెట్రో రైలు ప్రాజెక్టు విస్తరణకు శంకుస్థాపన చేసిన ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి

Related image

ఫలక్ నుమా సమీపంలోని ఫరూక్ నగర్ బస్ డిపో వద్ద పాత బస్తీ మెట్రో రైలు ప్రాజెక్టు విస్తరణకు శంకుస్థాపన చేసిన ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి గారు. ఈ కార్యక్రమంలో ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ వెంకట్, ఎమ్మెల్యేలు తదితరులు పాల్గొన్నారు. 

పాతబస్తీ మెట్రోరైలు ప్రాజెక్టు శంకుస్థాపన కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిగారి స్పీచ్ స్క్రోలింగ్ పాయింట్స్... 

 కులీ కుతుబ్ షాహీ నుంచి నిజాం వరకు నగర అభివృద్ధికి కృషి చేశారు. 

 హైదరాబాద్ నగర ప్రతిష్టను నిలబెట్టడానికే మేం మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలతో ముందుకెళుతున్నాం. 

 ఎన్నికలు వచ్చినప్పుడే రాజకీయాలు.. మిగతా సమయంలో అభివృద్ధిపైనే మా దృష్టి. 

 ఇది ఓల్డ్ సిటీ కాదు.. ఇది ఒరిజినల్ హైదరాబాద్ సిటీ. 

 ఒరిజినల్ సిటీని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసేందుకు మేం కృషి చేస్తున్నాం. 

 మూసీ పరివాహక ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు మాస్టర్ ప్లాన్ రూపొందిస్తున్నాం. 

 ఇందుకోసం ఇప్పటికే లండన్ థెమ్స్ నగరాన్ని అక్బరుద్దీన్ తో కలిసి సందర్శించాం.. 

 పేద, మధ్యతరగతి ప్రజల కోసం మెట్రో ఫెజ్-2 ను తీసుకొస్తున్నాం. 

 ఒవైసీ హాస్పిటల్, చాంద్రాయణగుట్ట, మైలార్ దేవర్ పల్లి నుంచి ఎయిర్ పోర్టు వరకు మెట్రోరైలు ప్రాజెక్టు విస్తరణ చేయనున్నాం.

 చాంద్రాయణగుట్టలో మెట్రో జంక్షన్ ను ఏర్పాటు చేయబోతున్నాం. 

 చంచల్ గూడ జైలును తరలించి విద్యార్థుల కోసం పాఠశాల, కళాశాలలు నిర్మిస్తాం.. 

 హైదరాబాద్ సిటీలోప్రతీ గల్లీని అభివృద్ధి చేసే బాధ్యత మాది. 

 మైనారిటీల కోసం 4 శాతం రిజర్వేషన్ అమలు చేసిన ఘనత కాంగ్రెస్ ది. 

 రాష్ట్రంలో పదేళ్లు కాంగ్రెస్ అధికారంలో ఉంటుంది.. 

 ఇచ్చిన మాట ప్రకారం హైదరాబాద్ నగరాన్ని, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి చూపిస్తాం. 

 గండిపేట నుంచి నగరంలోని 55 కి.మీల పరిధిలో మూసీ నదీ పరివాహక ప్రాంతాన్ని సుందరంగా తీర్చిదిద్దుతాం.

              

More Press Releases