Janasena: రాజధాని గ్రామాల్లో రెండు రోజులపాటు పవన్ కల్యాణ్..
Add ap7am to your home Screen

రాజధాని గ్రామాల్లో రెండు రోజులపాటు పవన్ కల్యాణ్ పర్యటన!

రాజధాని గ్రామాల్లో రెండు రోజులపాటు పవన్ కల్యాణ్ పర్యటన!

జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ మరోసారి రాజధాని అమరావతిలో పర్యటించనున్నారు. ఈ పర్యటన రెండు రోజులపాటు కొనసాగుతుంది. రెండు రోజుల పర్యటనలో భాగంగా ఏ ఏ గ్రామాలు సందర్శించాలో నిర్ణయించవలసిందిగా స్థానిక నాయకులను పవన్ కల్యాణ్ ఆదేశించారు. అయితే పర్యటన తేదీలు ఇంకా ఖరారు కావాల్సి ఉంది. ఇటీవల అసెంబ్లీ ముట్టడి సందర్భంగా గాయపడిన వారు పవన్ కల్యాణ్ ని మంగళగిరి పార్టీ కార్యాలయంలో కలిశారు. ఈ సందర్భంగా రాజధాని గ్రామాల్లో మరోసారి పర్యటించాలని వారు కోరారు. పర్యటన ఎక్కడెక్కడ జరగాలి, ఏ విధంగా జరగాలి అనే కార్యాచరణను పార్టీ నాయకులు సిద్ధం చేసే పనిలో ఉన్నారు.

Janasena
Amaravati
Pawan Kalyan
Andhra Pradesh

Watch Today's Deals on Amazon

More Press News