తిరుమలలో ‘డియర్ ఉమ’ హీరోయిన్ సుమయా రెడ్డి

తిరుమలలో ‘డియర్ ఉమ’ హీరోయిన్ సుమయా రెడ్డి
తెలుగమ్మాయి హీరోయిన్‌గా, నిర్మాతగా మారి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడం అంటే సాధారణమైన విషయం కాదు. ‘డియర్ ఉమ’ సినిమాతో నిర్మాత, హీరోయిన్‌గా తెరపైకి రాబోతున్నారు సుమయా రెడ్డి. ఇప్పటికే సినిమాకు సంబంధించిన పనుల్ని పూర్తి చేశారు. ఈ మధ్యే సినిమాకు సంబంధించిన టీజర్‌ను రిలీజ్ చేయగా మంచి స్పందన వచ్చింది. 

సుమ చిత్ర ఆర్ట్స్ బ్యానర్ మీద డియర్ ఉమ అనే చిత్రం త్వరలోనే రాబోతోంది. అయితే ఈ క్రమంలో సుమయా రెడ్డి పుణ్యక్షేత్రాలను సందర్శిస్తున్నారు. దేవాలయాలకు విరాళం ఇస్తున్నారు. తాజాగా సుమయా రెడ్డి తిరుమలలో ప్రత్యక్షమయ్యారు. శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. తిరుమలలో సుమయా రెడ్డి శ్రీవారిని ప్రత్యేకంగా దర్శించారు.

‘డియర్ ఉమ’ చిత్రంలో సుమయ రెడ్డి, దియా మూవి ఫేమ్ పృథ్వీ అంబర్ జంటగా నటించారు. ఈ మూవీని సుమయ రెడ్డి నిర్మించగా.. సాయి రాజేష్ మహాదేవ్ స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వ బాధ్యతలు చూసుకుంటున్నారు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన రిలీజ్ డేట్‌ను ప్రకటించనున్నారు.
Dear Uma
Sumaya Reddy

Watch Today's Deals on Amazon

More Press News