మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మార్చి 15 వరకు మహిళలకు ఉచిత కంటి పరీక్షను నిర్వహిస్తోన్న డాక్టర్ అగర్వాల్స్ ఐ హాస్పిటల్

Related image

● గర్భిణి లకు సాధారణంగా కనిపించే రక్తపోటు తో పాటుగా మెనోపాజ్ మరియు పెరిమెనోపాజ్ కారణంగా దృష్టి సంబంధిత ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడే మహిళలకు కంటి వ్యాధులు మరియు రుగ్మతల స్క్రీనింగ్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తుంది

తెలంగాణా, 2 మార్చి 2024: మార్చి 8న ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని, భారతదేశంలోని అతిపెద్ద కంటి ఆసుపత్రుల నెట్వర్క్  డాక్టర్ అగర్వాల్స్ ఐ హాస్పిటల్, తెలంగాణలోని తమ అన్ని శాఖలలో,  మార్చి 15, 2024 వరకు మహిళలకు ఉచిత కంటి పరీక్షల  శిబిరాన్ని నిర్వహిస్తోంది. 

గర్భిణి లకు సాధారణంగా కనిపించే రక్తపోటు తో పాటుగా మెనోపాజ్ మరియు పెరిమెనోపాజ్ కారణంగా దృష్టి సంబంధిత ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడే మహిళలకు కంటి వ్యాధులు మరియు రుగ్మతల స్క్రీనింగ్ కోసం ఆసుపత్రి ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఉచిత కంటి పరీక్ష కోసం 95949 24047 నంబరులో నమోదు చేసుకోవచ్చు.

 డాక్టర్ ప్రీతి ఎస్, హెడ్-క్లినికల్ సర్వీసెస్, డాక్టర్ అగర్వాల్స్ ఐ హాస్పిటల్స్  మాట్లాడుతూ పురుషులు మరియు స్త్రీలకు వారి కళ్లలో తేడాలు ఉంటాయి.  కొన్ని రకాల  దృష్టి సమస్యలకు స్త్రీలు  ఎక్కువ అవకాశం కలిగి ఉంటారు. వారికి రెగ్యులర్ స్క్రీనింగ్ అవసరం.

ఇంకా, మెనోపాజ్  మరియు పెరిమెనోపాజ్ సమయంలో కళ్ళు పొడిబారడం మరియు అస్పష్టమైన దృష్టికి కారణమవుతాయి. అలాగే, గర్భనిరోధక మాత్రలలోని హార్మోన్లు వాస్కులర్ మార్పులకు కారణమవుతాయి, పరోక్షంగా దృష్టి సమస్యలకు దోహదం చేస్తాయి.  

 డాక్టర్ అగర్వాల్స్ ఐ హాస్పిటల్ మహిళలకు  కంటి వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడానికి తీసుకోవాల్సిన చర్యలపై అవగాహన సెషన్‌లను కూడా నిర్వహిస్తుంది. తెలంగాణా అంతటా ఆసుపత్రి యొక్క ఉచిత కంటి చెకప్ మరియు అవగాహన ప్రచారం మహిళలకు ప్రమాదాల గురించి అవగాహన కల్పిస్తుంది. 

More Press Releases