హైదరాబాద్‌లో నూతనంగా విస్తరించిన మెడ్‌ట్రానిక్ ఇంజినీరింగ్ & ఇన్నోవేషన్ సెంటర్‌ను ప్రారంభించిన మంత్రి శ్రీ డి. శ్రీధర్ బాబు

Related image

    యుఎస్  వెలుపల మెడ్‌ట్రానిక్ యొక్క అతిపెద్ద పరిశోధన మరియు అభివృద్ధి (ఆర్ & డి) కేంద్రం గా నిలిచిన మెడ్‌ట్రానిక్ ఇంజినీరింగ్ & ఇన్నోవేషన్ సెంటర్‌ ( ఎంఈఐసి)  

   దాదాపు 250,000 చదరపు అడుగుల ఈ సదుపాయం  హైదరాబాద్‌లో హెల్త్‌కేర్ టెక్నాలజీ ఆర్ & డి కి అంకితమైంది. 


హైదరాబాద్, ఇండియా - ఫిబ్రవరి 29, 2024 - వైద్య సాంకేతికత లో అంతర్జాతీయంగా అగ్రగామి  సంస్థ అయిన మెడ్‌ట్రానిక్, ఈరోజు హైదరాబాద్‌లో  తాము నూతనంగా విస్తరించిన,  అత్యాధునిక మెడ్‌ట్రానిక్ ఇంజనీరింగ్ అండ్  ఇన్నోవేషన్ సెంటర్ (ఎంఈఐసి)ని ప్రారంభించింది. ఈ కేంద్రాన్ని గౌరవనీయులైన తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు & వాణిజ్య శాఖ మంత్రి శ్రీ డి. శ్రీధర్ బాబు ,   మెడ్‌ట్రానిక్ చైర్మన్ మరియు సీఈఓ ,  జెఫ్ మార్తా లు , గౌరవ అతిథి యుఎస్  కాన్సుల్ జనరల్ జెన్నిఫర్ లార్సన్ సమక్షంలో ప్రారంభించారు. ఈ ఆర్ & డి  కేంద్రం యొక్క విస్తరణ మెడ్‌ట్రానిక్ యొక్క లక్ష్యమైన  వ్యూహాత్మకంగా దాని గ్లోబల్ ఆర్ & డి కార్యకలాపాలను విస్తరించడం మరియు స్థానిక ఆవిష్కరణ పర్యావరణ వ్యవస్థలో పెట్టుబడి పెట్టడంకు అనుగుణంగా ఉంటుంది. ఆర్ & డి సౌకర్యాన్ని పెంచడానికి మరియు విస్తరించడానికి మరియు భవిష్యత్తులో 1500 మందికి ఉపాధి కల్పించడానికి మెడ్‌ట్రానిక్ ఐదు సంవత్సరాల కాలంలో ప్రకటించిన సుమారు రూ.  3000 కోట్ల  ($350M కంటే ఎక్కువ) పెట్టుబడిలో ఈ విస్తరణ భాగం.


 యుఎస్  వెలుపల మెడ్‌ట్రానిక్ యొక్క అతిపెద్ద ఆర్ & డి కేంద్రం, ఎంఈఐసి.  మొత్తం  250,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో వున్న ఈ  ఎంఈఐసి భాగస్వామ్య  ఆవిష్కరణలు, శిక్షణ మరియు విద్య, విస్తరించిన ప్రాంగణం నుండి లీనమయ్యే అనుభవాలు పై దృష్టి సారించటం తో పాటుగా , ఇవన్నీ ఆరోగ్య సంరక్షణ సాంకేతికత యొక్క భవిష్యత్తును రూపొందించే లక్ష్యంతో ఉంటాయి. ఈ నూతన ప్రాంగణం లో  డిజిటల్ థెరపీ & ఇన్నోవేషన్ ల్యాబ్, కనెక్టెడ్ కేర్ ల్యాబ్, ప్లాట్‌ఫారం  & టెక్ ల్యాబ్, సిస్టమ్స్ ఇంజినీరింగ్ ల్యాబ్, సాఫ్ట్‌వేర్ ల్యాబ్, అలాగే కొత్త వర్క్‌స్టేషన్లు మరియు ఉద్యోగుల కోసం వెల్నెస్ సౌకర్యాలు ఉంటాయి.


ఈ కేంద్ర  ప్రారంభోత్సవ కార్యక్రమంలో గౌరవనీయ  తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు మరియు వాణిజ్య శాఖల  మంత్రి శ్రీ డి శ్రీధర్ బాబు మాట్లాడుతూ, హైదరాబాద్‌లో ఎంఈఐసి ఉండటం,  హైదరాబాద్‌లో మెడ్‌టెక్ ఆవిష్కరణలకు హాట్‌స్పాట్‌గా ఎదుగుతుందనడానికి నిదర్శనం. రాష్ట్రంలో పెరుగుతున్న ఈ ఆవిష్కరణ సంస్కృతిని పెంపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉంది.  వైద్య పరికరాల తయారీ మరియు పరిశోధన & అభివృద్ధి రెండింటికీ ఆదర్శవంతమైన గమ్యస్థానంగా హైదరాబాద్‌ను ప్రపంచ పటంలో నిలిపేందుకు కృషి చేస్తుంది. మెడ్‌ట్రానిక్ వృద్ధికి మద్దతివ్వడానికి మేము ఆసక్తిగా ఉన్నాము మరియు ఆరోగ్య సంరక్షణ ఆవిష్కరణలో రాష్ట్రం మరియు దేశంలో వారి సహకారం కోసం ఎదురుచూస్తున్నాము..." అని అన్నారు. 


మెడ్‌ట్రానిక్ ఛైర్మన్ మరియు సీఈఓ  జెఫ్ మార్తా మాట్లాడుతూ, "మెడ్‌ట్రానిక్‌లో అభివృద్ధి చేయబడిన  ప్రతి సాంకేతికత లో జీవితాన్ని మార్చతగిన ఆవిష్కరణ  ప్రధానమైనది. భారతదేశంలోని మా ఆర్&డి  బృందం మెడ్‌ట్రానిక్ యొక్క గ్లోబల్ ప్రొడక్ట్ డెవలప్‌మెంట్‌లో కీలక పాత్ర పోషిస్తుంది మరియు ఎంఈఐసి యొక్క విస్తరణ మా ప్రపంచ ఆర్&డి సామర్థ్యాలను బలోపేతం చేయడంలో ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుంది. అభివృద్ధి చెందుతున్న స్థానిక ఆవిష్కరణ పర్యావరణ వ్యవస్థను నిర్మించినందుకు తెలంగాణ ప్రభుత్వానికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ రోజు ఆవిష్కరణ మరియు వృద్ధికి గణనీయమైన అవకాశాలు వున్నాయి మరియు ఆరోగ్య సంరక్షణ సాంకేతికత యొక్క భవిష్యత్తు బలమైన ఆర్&డి పై ఆధారపడి ఉంటుంది..." అని అన్నారు 


ఎంఈఐసి వైస్ ప్రెసిడెంట్ & సైట్ లీడర్ దివ్య ప్రకాష్ జోషి మాట్లాడుతూ, “ఎంబెడెడ్ మరియు ఎంటర్‌ప్రైజ్ సాఫ్ట్‌వేర్, ప్రొడక్ట్ సెక్యూరిటీ, డేటా ఇంజనీరింగ్, సిస్టమ్స్ ఇంజినీరింగ్ రంగాలలో సాఫ్ట్‌వేర్ ఇంజనీరింగ్ సొల్యూషన్స్ మరియు ఇతర ఇంజనీరింగ్ నైపుణ్యాలను అందించడానికి ఎంఈఐసి ప్రస్తుతం మెడ్‌ట్రానిక్ యొక్క మెకానికల్ మరియు హార్డ్‌వేర్ డిజైన్, మరియు నాణ్యత & నియంత్రణ సహా అనేక గ్లోబల్ బిజినెస్ యూనిట్లకు మద్దతు ఇస్తుంది.  ఈ విస్తరణ ప్రపంచవ్యాప్తంగా మరింత మంది రోగుల జీవితాలను ప్రభావితం చేయడానికి మరియు ఆరోగ్య సంరక్షణ సాంకేతిక పరిశ్రమను అభివృద్ధి చేయడానికి మా నిబద్ధతను పెంచడంలో సహాయపడుతుంది. హెల్త్‌కేర్ టెక్నాలజీ భవిష్యత్తును రూపొందించడంలో మాకు నిరంతర మద్దతు ఇస్తున్నందుకు తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు..." అని అన్నారు. 


 ఈ శుభ సందర్భంలో మెడ్‌ట్రానిక్‌కి చెందిన సీనియర్ నాయకులు జెఫ్‌  మరియు గౌరవనీయ మంత్రి శ్రీ డి. శ్రీధర్ బాబు  తో కలిసి  ఎంటర్‌ప్రైజ్ ఆర్&డి వైస్ ప్రెసిడెంట్ మణి ప్రకాష్; ఫెంగ్ డాంగ్, వైస్ ప్రెసిడెంట్ ఆసియా RLM మరియు దివ్య ప్రకాష్ జోషి, వైస్ ప్రెసిడెంట్ & సైట్ లీడర్, ఎంఈఐసి. యుఎస్ కాన్సుల్ జనరల్ జెన్నిఫర్ లార్సన మరియు తెలంగాణ ప్రభుత్వ తెలంగాణ లైఫ్ సైన్సెస్ సిఇఒ శక్తి ఎం నాగప్పన్ కూడా పాల్గొన్నారు.


ఒక దశాబ్దానికి పైగా, ఎంఈఐసి భారతదేశంలోని హైదరాబాద్‌లోని దాని ప్రాంగణంలో ప్రపంచ ఆరోగ్య సంరక్షణలో శ్రేష్ఠతకు దోహదపడింది. 2011 నుండి, కేంద్రంలోని ప్రత్యేక ఇంజనీర్ల బృందం నిజమైన వ్యక్తుల కోసం నిజమైన పరిష్కారాలను రూపొందించడానికి పని చేయడానికి వినూత్న ఆలోచనలను ఉంచింది. 900 ఇంజనీర్‌లతో, ఎంఈఐసి విభిన్న ఆవిష్కరణలను తీసుకువచ్చే కొన్ని ఉత్తమ STEM ప్రతిభకు నిలయంగా ఉంది. దాని సాంకేతిక నైపుణ్యానికి మించి, ఎంఈఐసి భారతదేశంలోని మెడ్‌ట్రానిక్ వాణిజ్య బృందంతో సన్నిహితంగా సహకరిస్తుంది, దేశవ్యాప్తంగా కీలక అభిప్రాయ నాయకులు, విద్యా సంస్థలు మరియు హాస్పిటల్ నెట్‌వర్క్‌లతో వ్యూహాత్మక మరియు దీర్ఘకాలిక భాగస్వామ్యాలను ప్రోత్సహిస్తుంది. ఈ సహకార విధానం విస్తృత ఆరోగ్య సంరక్షణ పర్యావరణ వ్యవస్థలో కీలక పాత్ర పోషించడానికి కేంద్రం యొక్క నిబద్ధతను నొక్కి చెబుతుంది.

     

More Press Releases