మేడారం - అమ్మవార్లను దర్శించుకున్న గౌరవ స్పీకర్ గడ్డం ప్రసాద్

 మేడారం - అమ్మవార్లను దర్శించుకున్న గౌరవ స్పీకర్ గడ్డం ప్రసాద్
తెలంగాణ మహా కుంభమేళా  అయిన  మేడారం  జాతర  సందర్బంగా గద్దెల మీద కొలువైన  సమ్మక్క, సారాలమ్మా ను శనివారం తెలంగాణ శాసనసభ  స్పీకర్ గడ్డం  ప్రసాద్ దర్శించుకున్నారు. ముందుగా గద్దెల ముందు ఏర్పాటు చేసిన తులాభారం  వద్ద స్పీకర్ తన 72 కిలోల ఎత్తు బంగారాన్ని సమర్పించారు.అనంతరం  గద్దెల  వద్దకు చేరుకొని   చీర, గాజులు, పసుపు కుంకుమ సమర్పించి తల్లులకు  పూజలు చేసారు.అన్నీ శాఖల అధికారులు సమన్వయము గా పనిచేసి జాతర  ను అత్యంత  వైభవం గా నిర్వహిస్తున్నారని వారందరిని స్పీకర్ అభినందించారు. రాష్ట్రం  సుభిక్షంగా  ఉండాలని కోరుకున్నానని ...జాతర కు వచ్చిన ప్రతీ భక్తున్ని అమ్మవారు ఆశీర్వదిస్తారని  స్పీకర్ అన్నారు.
 
స్పీకర్ వెంట రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మాత్యులు ధనసరి  అనసూయ  సీతక్కఉన్నారు.

          
Medaram Jatara
Gaddam Prasad Kumar
Seethakka

More Press News