వరద ముంపు నివారణకు జోనల్ వారీగా పటిష్టమైన ప్రణాళికలు సిద్ధం చేయాలి: దానకిషోర్

Related image

*హైదరాబాద్, ఫిబ్రవరి 16:*    రానున్న వర్ష కాలంలో వరద ముంపు నివారణకు జోనల్ వారీగా పటిష్టమైన ప్రణాళికలు సిద్ధం చేయాలని మున్సిపల్  శాఖ ముఖ్య కార్యదర్శి దానకిషోర్ అధికారులను ఆదేశించారు.గురువారం సి.డి.ఎం.ఏ కార్యాలయంలో జిహెచ్ఎంసి కమిషనర్ రోనాల్డ్ రోస్, ఈ.వి.డి.ఎం డైరెక్టర్ ప్రకాష్ రెడ్డి, జోనల్ కమిషనర్లు, ఈ.ఎన్.సి, సి.ఈ,లు జోనల్ ఎస్.ఈ, ఇరిగేషన్ ఎస్.ఈ,  లతో కలిసి ముఖ్య కార్యదర్శి మాన్సూన్ ప్రిపరేషన్ ఏర్పాట్ల పై సమీక్షించారు.


ఈ  సందర్భంగా ముఖ్య కార్యదర్శి దానకిషోర్ మాట్లాడుతూ... జిహెచ్ఎంసి ఏరియా లో వర్షాకాలంలో ముంపుకు గురయ్యే కాలనీ ల వివరాలు,  ప్రభావిత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు పునరావాస కేంద్రాల వివరాలు అవసరమైన నిధుల కోసం కూడా జోన్ ల వారీగా ప్రణాళిక ను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. అట్టి ప్రణాళికలో ఏడాదికి అయ్యే ఖర్చు వివరాలు ఉండాలన్నారు. మ్యాన్ హోల్స్, క్యాచ్ ఫిట్ ఏరియాలో వరద వలన ప్రమాదాలు జరగకుండా ప్రజలకు పూర్తిగా అవగాహన కల్పించాలి అన్నారు. సి.ఆర్.ఎం.పి రోడ్డు పైన ఉన్న మ్యాన్ హోల్స్ ప్రమాదాలు సంభవించకుండా రోడ్డుకు సమాంతరంగా యెత్తు ఉండే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. 


వర్ష కాలం నాటికి నాలా పూడికతీత పూర్తి చేయాలని, అదే విధంగా స్టార్మ్ వాటర్ డ్రెయిన్ల అసంపూర్తి పనులను పూర్తి చేసి వచ్చే వర్షాకాలంలో ప్రజలకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు.  వరద ముంపు నివారణ కోసం చేపట్టిన నాలా అభివృద్ధి పనుల వలన ఇప్పటి వరకు అనేక కాలనీలలో ముంపు నివారణకు  జరిగిన నేపథ్యంలో మిగిలిన పనులను కూడా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. నాలా అభివృద్ధి పనుల లో జిహెచ్ఎంసి కి చుట్టూ ప్రక్కల మున్సిపాలిటీ లో పనులను కూడా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ నేపథ్యంలో రెండో దశ ఎస్.ఎన్.డి.పి ద్వారా చేపట్టడం మూలంగా ముంపు నివారణ సమస్య  పూర్తిగా తీరే అవకాశం ఉన్నందున అట్టి ప్రతిపాదించిన పనుల లో ముఖ్య పనులు చేపట్టేందుకు పూర్తి ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.


రెండో దశ సి.ఆర్.ఎం.పి పనులు కూడా చేపట్టేందుకు అవసరమైన ప్రతిపాదనలు తయారు చేయాలని ఈ.ఎన్.సి ని ఆదేశించారు. వాటర్ లాగింగ్ పాయింట్  మేజర్ 101, మీడియం 127, మైనర్ 92 కాగా అట్టి పాయింట్ లను రోడ్ మ్యాప్ గుర్తించే ఏర్పాట్లను చేయాలని అన్నారు. వాటర్ లాగింగ్ పాయింట్ లతో పాటు పనికి రాని బోర్ వెల్స్ లను కూడా గుర్తించి వాటి వలన ప్రజలకు ప్రమాదాలు జరగకుండా తగు చర్యలు తీసుకోవాలన్నారు. రోడ్డు పై వరద నీరు నిలిచిన సందర్భంలో ప్రమాదాలు సంభవించకుండా సైన్ బోర్డు ఏర్పాటు చేయాలని,  అంతేకాకుండా స్టార్మ్ వాటర్ నాలా లో ప్రమాదాల నివారణకు హెచ్చరిక బోర్డు లతో పాటు మేష్ ఏర్పాటుకు కూడా చర్యలు తీసుకోవాలన్నారు.


ఈ సమావేశంలో  ఈ.ఎన్.సి జియా ఉద్దీన్, సి.ఈ లు దేవానంద్, కిషన్, జోనల్ కమిషనర్లు రవికిరణ్, వెంకటేష్ దోత్రె, అభిలాష అభినవ్, పంకజ, వెంకన్న, జోనల్ యస్.ఈ లు రత్నాకర్, అశోక్ రెడ్డి, చిన్నారెడ్డి, చార్మినార్, శేరిలింగంపల్లి జోనల్ యస్.ఈ లు పాల్గొన్నారు.

More Press Releases