ప్రభుత్వ సలహాదారుగా పదవీ బాధ్యతలు స్వీకరించిన మహమ్మద్అ లీ షబ్బీర్

ప్రభుత్వ సలహాదారుగా పదవీ బాధ్యతలు స్వీకరించిన మహమ్మద్అ లీ షబ్బీర్
హైదరాబాద్, ఫిబ్రవరి 3 : రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా మహమ్మద్ అలీ షబ్బీర్ నేడు పదవీ బాధ్యతలను స్వీకరించారు. బి.అర్.అంబేడ్కర్ సచివాలయంలో తన కార్యాలయంలో ప్రార్థనల అనంతరం పదవీ బాధ్యతలను స్వీకరించారు. 


రాష్ట్ర ప్రభుత్వ ఎస్.సి, ఎస్.టి. బీసీ, మైనారిటీ సంక్షేమ సలహాదారుగా పదవీ బాధ్యతలు స్వీకరించిన షబ్బీర్ అలీ ని రాష్ట్ర రెవిన్యూ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి, ఆబ్కారీ, పర్యాటక, సాంస్కృతిక శాఖా మంత్రి జూపల్లి కృష్ణ రావు, బీసీ కమీషన్ చైర్మన్ కృష్ణ మోహన్ రావు, న్యూ ఢిల్లీలో ప్రభుత్వ సలహాదారు మల్లు రవి, జీఏడీ కార్యదర్శి రఘునందన్ రావు, మైనారిటీ సంక్షేమ శాఖ కార్యదర్శి ఉమర్ జలీల్, గురుకుల విద్యా సంస్థల కార్యదర్శి నవీన్ నికోలస్, పలువురు ప్రజాప్రతినిధులు పూల గుచ్చాలతో అభినందించారు.
Mohammad Ali Shabbir
Telangana
Congress

More Press News