ఆకట్టుకుంటోన్న లక్ష్ చదలవాడ ‘ధీర’ మేకింగ్ వీడియో

ఆకట్టుకుంటోన్న లక్ష్ చదలవాడ ‘ధీర’ మేకింగ్ వీడియో
లక్ష్ చదలవాడ ప్రస్తుతం ‘ధీర’ అనే మంచి కమర్షియల్ సబ్జెక్టుతో రాబోతున్నారు.   వలయం, గ్యాంగ్‌స్టర్ గంగరాజు వంటి హిట్ సినిమాల తరువాత లక్ష్ మరోసారి అందరినీ ఆకట్టుకునేందుకు సిద్దంగా ఉన్నారు. ఈ మూవీని చదలవాడ బ్రదర్స్ సమర్పణలో శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర బ్యానర్‌ మీద పద్మావతి చదలవాడ నిర్మిస్తున్నారు.  విక్రాంత్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ ప్రాజెక్ట్ మీద అందరిలోనూ అంచనాలు ఏర్పడ్డాయి. 

ధీర గ్లింప్స్,  టీజర్‌ ఆడియెన్స్‌లో అంచనాలు పెంచేశాయి. ఈ మూవీ జానర్ ఏంటి? ఎలా ఉండబోతోంది? అనే హింట్ ఇచ్చేశారు మేకర్లు. అయితే తాజాగా ఈ చిత్రం నుంచి మేకింగ్ వీడియోను వదిలారు. షూటింగ్ స్పాట్‌లో యూనిట్ ఎంత సరదాగా ఉందో.. ఎంత కష్టపడి చిత్రీకరణ చేశారో చూపించేలా వదిలిన ఈ మేకింగ్ వీడియో అందరినీ ఆకట్టుకుంటోంది.

ధీర మూవీ షూటింగ్ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు, సెన్సార్ కార్యక్రమాలు కూడా కంప్లీట్ అయ్యాయి. ఈ చిత్రం ఫిబ్రవరి 2న గ్రాండ్‌గా విడుదల కానుంది.

నటీనటులు: లక్ష్ చదలవాడ నేహా పఠాన్, సోనియా బన్సాల్, మిర్చి కిరణ్, హిమజ, నవీన్ నేని, భరణి శంకర్, సామ్రాట్, బాబీ బేడి, వైవా రాఘవ్, భూషణ్, మేక రామకృష్ణ, సంధ్యారాణి తదితరులు

సాంకేతిక బృందం
సమర్పణ: చదలవాడ బ్రదర్స్ 
బ్యానర్: శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశ్వర 
నిర్మాత: పద్మావతి చదలవాడ
సంగీతం: సాయి కార్తీక్
సినిమాటోగ్రఫీ:  కన్నా పీసీ
ఫైట్ మాస్టర్: జాషువ, వింగ్ చున్ అంజి
ఎడిటర్: వినయ్ రామస్వామి
రచన మరియు దర్శకత్వం: విక్రాంత్ శ్రీనివాస్
పి.ఆర్.ఓ: సాయి సతీష్, రాంబాబు

Dheera

Watch Today's Deals on Amazon

More Press News