ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు

ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు
ముఖ్యమంత్రి కార్యాలయము తెలంగాణ ప్రభుత్వం

పత్రికా ప్రకటన-02 తేదీ: 13 -01- 2024 


రాష్ట్ర ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు రాష్ట్ర ప్రజలందరికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. పాత నిర్బంధపు చీకట్లను రూపుమాపే కొత్త కాంతులు ఇంటింటా వెల్లివిరియాలని ఆశాభావం వ్యక్తం చేశారు. సూర్యుని కొత్త ప్రయాణం కొత్త మార్పుకు నాంది పలకాలని, రాష్ట్రమంతటా సంక్షేమంతో పాటు అభివృద్ధి వెలుగులు విరజిమ్మాలని అన్నారు. భోగ భాగ్యాలను అందించే భోగి.. కొత్త కాంతులు తెచ్చే సంక్రాంతి.. కనుమ పండుగలు.. అందరూ ఆనందంగా జరుపుకోవాలని మనసారా ఆకాంక్షించారు. తెలంగాణలో మొదలైన ప్రజా పాలనలో స్వేచ్ఛా సౌభాగ్యాలతో ప్రజలు సంతోషంగా పండుగ సంబురాలు జరుపుకోవాలని అన్నారు. సకల జన హితానికి, ప్రగతి పథానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని సీఎం హామీ ఇచ్చారు.
Revanth Reddy
Congress
Telangana
Sankranti

More Press News