బడ్జెట్ ప్రతిపాదనలపై మంత్రి కొప్పుల ఈశ్వర్ సమీక్ష!

బడ్జెట్ ప్రతిపాదనలపై మంత్రి కొప్పుల ఈశ్వర్ సమీక్ష!

రానున్న 2020 - 21 ఆర్థిక సంవత్సరానికి గాను బడ్జెట్ ప్రతిపాదనలు సిద్ధం చేయాలని తెలంగాణ రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ తన శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు. స్థానిక బూర్గుల రామకృష్ణ రావు భవనంలోని తన కార్యాలయంలో బడ్జెట్ ప్రతిపాదనలపై సమీక్ష నిర్వహించారు. షెడ్యూల్ కులాల కార్పొరేషన్ లోని వివిధ పథకాలపై, గురుకుల పాఠశాలలో మౌలిక వసతుల కల్పనకు, రానున్న పదవ తరగతి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించే విధంగా విద్యార్థులను తీర్చిదిద్దాలని ఈ సందర్భంగా సూచించారు.

ఈ సమావేశంలో షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ మిశ్రా గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి డా. ఆర్. ఎస్. ప్రవీణ్ కుమార్, షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ సంచాలకులు కరుణాకర్, షెడ్యూల్ కులాల కార్పొరేషన్ ఎండి లచ్చిరాం భూక్య అదనపు కార్యదర్శి పార్వతీదేవి రాజసులోచన లు పాల్గొన్నారు.

Koppula Eshwar
Telangana
Hyderabad

More Press News