దినేష్‌ తేజ్ పుట్టిన రోజు సందర్భంగా 'అలా నిన్ను చేరి' నుంచి స్పెషల్ పోస్టర్

Related image

ఇప్పుడు కుర్ర హీరోలు మంచి దూకుడు మీదున్నారు. యంగ్ హీరోలు కొత్త కొత్త కథలు ఎంచుకుంటూ ఆడియెన్స్‌ను ఆకట్టుకుంటూ ఉంటున్నారు. ఈ క్రమంలోనే దినేష్ తేజ్ మరో కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. అలా నిన్ను చేరి అంటూ ఇది వరకు దినేష్ తేజ్ సినిమా అప్డేట్లను సోషల్ మీడియాలో వదలగా.. మంచి రెస్పాన్స్ వచ్చింది. నేడు (మే 26) దినేష్ తేజ్ బర్త్ డే సందర్భంగా స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు.

దినేష్ తేజ్ మంచి నటుడిగా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడే. ఇప్పుడు ఆయన పుట్టిన రోజు సందర్భంగా అలా నిన్ను చేరి అనే సినిమా నుంచి స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్‌ను చూస్తుంటే మాస్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా చిత్రీకరించే సాంగ్‌లో ఈ స్టిల్ ఉంటుందని తెలుస్తోంది. ఈ లుక్‌లో దినేష్ తేజ్ ఆడియెన్స్‌ను ఆకట్టుకునేలా కనిపిస్తున్నారు.

విజన్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై కొమ్మలపాటి శ్రీధర్ సమర్పణలో  రాబోతోన్న ‘అలా నిన్ను చేరి’  సినిమాతో మారేష్ శివన్ దర్శకుడిగా పరిచయం కాబోతున్న ఈ సినిమా షూటింగ్ ఇటీవలే పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు చివరి దశకు చేరుకున్నాయి. ఈ సినిమాలో దినేష్ తేజ్ సరసన హెబ్బా పటేల్, పాయల్ రాధాకృష్ణ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాను కొమ్మలపాటి సాయి సుధాకర్ నిర్మిస్తున్నారు. 

ఈ సినిమాకు సుభాష్‌ ఆనంద్ సంగీతం అందించగా.. ఆస్కార్ విన్నర్ చంద్రబోస్ అన్ని పాటలు రాయడం విశేషం. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదల చేసిన ఫస్ట్ లుక్ గ్లింప్స్, మోషన్ పోస్టర్, ఫస్ట్ లుక్ పోస్టర్‌కు విశేషమైన స్పందన వచ్చిన సంగతి తెలిసిందే. త్వరలోనే రిలీజ్ డేట్‌ను మేకర్లు ప్రకటించనున్నారు.  

    నటీనటులు: దినేష్ తేజ్, హెబ్బా పటేల్, పాయల్ రాధాకృష్ణ, శివకుమార్ రామచంద్రవరపు, శత్రు, కల్పలత, ‘రంగస్థలం’ మహేష్, ఝాన్సీ, కేదర్ శంకర్ తదితరులు.

సాంకేతిక బృందం
కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్, దర్శకత్వం: మారేష్ శివన్
నిర్మాత: కొమ్మాలపాటి సాయి సుధాకర్
బ్యానర్: విజన్ మూవీ మేకర్స్
సమర్పకుడు: కొమ్మాలపాటి శ్రీధర్
ఎగ్జిగుటివ్ ప్రొడ్యూసర్: కర్నాటి రాంబాబు
డీఓపీ : ఆండ్రూ
సంగీతం: సుభాష్ ఆనంద్
ఎడిటర్: కోటగీటి వెంకటేశ్వరరావు
కళ: విఠల్
సాహిత్యం: చంద్రబోస్
ఫైట్స్: కింగ్ సోలమన్, రామకృష్ణ (ఆర్కే)
కొరియోగ్రఫీ: భాను
కాస్ట్యూమ్ డిజైనర్: మదాసర్ మహమ్మద్
పబ్లిసిటీ డిజైనర్: ధని ఏలే
పీఆర్వో : సాయి సతీష్, పర్వతనేని రాంబాబు

 

More Press Releases